Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ చెత్త రికార్డు..!

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ చెత్త రికార్డు..!

Telugu Samayam 1 week ago

పీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్‌లో 9 విజయాలతో సత్తాచాటిన ఆ జట్టు.. కీలక మ్యాచ్‌లో మాత్రం తడబడింది. దీంతో ఓ చెత్త రికార్డును ఎస్‌ఆర్‌హెచ్‌.. నమోదు చేసింది. అత్యధిక సార్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయిన ఐపీఎల్ జట్టుగా నిలిచింది.

కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎకంగా నాలుగుసార్లు ఎలిమినేటర్‌లో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ జాబితాలో తర్వాతి స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. అత్యల్పంగా గుజరాత్ టైటాన్స్ జట్టు ఒకసారి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్‌ 196 పరుగులకు ఆలౌట్ అయింది.

ఎలిమినేటర్‌లో అత్యధిక సార్లు ఓడిపోయిన జట్లు ఇవే..


4 - సన్‌ రైజర్స్ హైదరాబాద్‌
3 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2 - కోల్‌కతా నైట్ రైడర్స్‌
2 - లక్నో సూపర్ జెయింట్స్‌
2 - ముంబై ఇండియన్స్‌
2 - రాజస్థాన్ రాయల్స్‌
1 - గుజరాత్ టైటాన్స్‌

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి, తొలి టైటిల్ ముద్దాడింది. ఇది జరిగిన తర్వాత 2026 సీజన్ వరకు సన్‌రైజర్స్ ఆరు సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది.

ఐపీఎల్ 2016 తర్వాత ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రదర్శన..


ఐపీఎల్ 2017 - ఎలిమినేటర్‌ (vs కోల్‌కతా నైట్ రైడర్స్‌)
ఐపీఎల్ 2018 - ఫైనల్‌ (vs చెన్నై సూపర్ కింగ్స్‌)
ఐపీఎల్ 2019 - ఎలిమినేటర్‌ (vs ఢిల్లీ క్యాపిటల్స్‌)
ఐపీఎల్ 2020 - క్వాలిఫయర్‌- 2 (vs ఢిల్లీ క్యాపిటల్స్‌)
ఐపీఎల్ 2024 - ఫైనల్‌ (vs కోల్‌కతా నైట్ రైడర్స్‌)
ఐపీఎల్ 2026 - ఎలిమినేటర్‌ (vs రాజస్థాన్ రాయల్స్‌)
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam