Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కెప్టెన్‌గా రజత్ పటీదార్.. వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్..!

కెప్టెన్‌గా రజత్ పటీదార్.. వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్..!

Telugu Samayam 14 hrs ago

భారత దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ సీజన్ 2026 ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీతో వైభవంగా ప్రారంభం కాబోతోంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఈ టోర్నీ జరగనుంది.

ఈ క్రమంలో దులీప్ ట్రోఫీ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్ తమ జట్టును అధికారికంగా ప్రకటించింది. ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాక్-టు-బ్యాక్ టైటిళ్లు అందించిన రజత్ పటీదార్‌ను సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఫినిషర్ రింకూ సింగ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు.

ఈ జట్టులో పలువురు సీనియర్ ఆటగాళ్లతో పాటు యంగ్ టాలెంట్స్ కూడా చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో పటీదార్, రింకూలతో పాటు ఆర్యన్ జుయల్, అమన్ మోఖాడే, కుణాల్ చండేలా, యష్ రాథోడ్, ఆయుష్ పాండేలు బరిలోకి దిగనున్నారు. ఆల్‌రౌండర్లుగా హర్ష్ దూబే, అర్షద్ ఖాన్, సారాంశ్ జైన్‌ ఎంపిక అయ్యారు. బౌలింగ్ విభాగాన్ని జీషన్ అన్సారీ, ఆర్యన్ పాండే, యష్ ఠాకూర్, నాచికేత్ భూతే నడిపించనున్నారు. ఆర్యన్ జుయల్, కుణాల్ సింగ్ రాథోడ్‌లను వికెట్ కీపర్లుగా జట్టులోకి తీసుకున్నారు.

కాగా, శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత జట్టులో చోటు సంపాదించిన ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, దులీప్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్ దూరమవ్వడంతో ఆగస్టు 15న గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమయ్యే తొలి టెస్టులో సారాంశ్ జైన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానుండటం వల్ల, అదే రోజు ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ ప్రారంభ రౌండ్‌లో అతడు సెంట్రల్ జోన్ జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చు.

దులీప్ ట్రోఫీ భారత రెడ్ బాల్ క్రికెట్ క్యాలెండర్‌లో అత్యంత కీలకమైన టోర్నమెంట్ కావడంతో, అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు అనేక మంది యువ రంజీ స్టార్స్ ఇందులో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. పటీదార్, రింకూ సింగ్ వంటి అనుభవజ్ఞులైన బ్యాటర్ల నాయకత్వంలో సెంట్రల్ జోన్.. వరుసగా రెండో టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంది.


సెంట్రల్ జోన్ జట్టు: రజత్ పటీదార్ (కెప్టెన్), రింకు సింగ్ (వైస్ కెప్టెన్), ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), సారాంశ్ జైన్, అమన్ మొఖడే, కునాల్ చండేలా, జీషన్ అన్సారీ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్ సింగ్ దూబే, కునాల్క్ దూబే, కునాల్క్ దూబే భూతే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam