Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rashmika Injury: షూటింగ్‌లో గాయపడ్డ రష్మిక మందన్న.. 6 వారాల విశ్రాంతి

Rashmika Injury: షూటింగ్‌లో గాయపడ్డ రష్మిక మందన్న.. 6 వారాల విశ్రాంతి

Telugu Samayam 3 weeks ago

సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గాయపడ్డారు. సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లగా, తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు డాక్టర్లు గుర్తించారు.

ఆమె చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకోడానికి ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలుస్తోంది.

రష్మిక మందన్న ప్రస్తుతం 'రణబాలి', 'మైసా' వంటి రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల 'మైసా' షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా రష్మిక గాయపడ్డారు. అంతకముందు కూడా పలు సందర్భాల్లో ఆమెకు దెబ్బలు తగిలాయి. లాస్ట్ ఇయర్ జనవరిలో జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా ఆమె కాలికి గాయమైంది. ఆ సమయంలో వీల్ చైర్ లో కూర్చునే 'ఛావా' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి సెట్స్ లో అడుగుపెట్టారు.

రష్మిక కొంతకాలంగా 'రణబాలి', 'మైసా' సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. అందులో శారీరక శ్రమతో కూడిన యాక్షన్‌ సీన్స్, డ్యాన్సులు చేస్తుండటంతో.. రష్మిక తుంటి భాగంలోని స్నాయువు పూర్తిగా తెగిపోయింది. ఆ గాయం తీవ్రతని గమనించిన డాక్టర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని రష్మిక సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కఠినమైన ట్రైనింగ్ తెసుకునేవాళ్ళు, క్రీడాకారుల్లోనే ఇలాంటి గాయాలు కనిపిస్తుంటాయని వైద్యులు చెప్పారట. అందుకే 6 వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: ప్రభాస్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదేమో అనిపించింది.. జనం కొట్టిన దెబ్బకు మాడు పగిలిపోయింది: నిర్మాత ఎంఎస్ రాజు

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ స్టార్స్ ను గాయాలు వెంటాడుతున్నాయి. ఎప్పట్నుంచో బాధ పెడుతున్న గాయాలతోనూ, సెట్స్‌లో ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలతోనూ పలువురు హీరోలు సర్జరీలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. షూటింగులకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ పూర్తిగా రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు రష్మిక కూడా అదే తరహాలో గాయపడ్డారు. దీంతో ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాల షూటింగులు నిలిచిపోనున్నాయి.

తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా నటీనటులు షూటింగ్‌లలో గాయపడుతున్న నేపథ్యంలో, రష్మిక కూడా గాయపడటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రిస్కీ సీన్స్ షూట్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam