Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. సీఎస్కేలోకి రూ.13 కోట్ల ప్లేయర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. సీఎస్కేలోకి రూ.13 కోట్ల ప్లేయర్

Telugu Samayam 1 day ago

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఐపీఎల్ ట్రేడింగ్ మార్కెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీలు ఒక భారీ ప్లేయర్ స్వాప్ డీల్‌ను అధికారికంగా పూర్తి చేశాయి.

రెండు ఫ్రాంఛైజీలు కలిపి నలుగురు ఆటగాళ్లను ట్రేడ్ చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇద్దరు విదేశీ ఆల్‌రౌండర్లు లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను సన్ రైజర్స్ నుంచి తమ గూటికి చేర్చుకుంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్‌తో పాటు ఆస్ట్రేలియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్‌లను సొంతం చేసుకుంది.

ఈ డీల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఇంగ్లాండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ భారీగా జీతం తగ్గింపుకు ఒప్పుకుని సీఎస్కేలోకి అడుగుపెట్టాడు. గత వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ అతడిని రూ. 13 కోట్లకు కొనుగోలు చేయగా, ఇప్పుడు సీఎస్కే రూ. 6 కోట్లకే అతడిని దక్కించుకోవడం విశేషం. ఆస్ట్రేలియాకు చెందిన జాక్ ఎడ్వర్డ్స్ కూడా తన పాత కాంట్రాక్ట్ ధర రూ. 3 కోట్లకు చెన్నై జట్టులోకి చేరుతున్నాడు. గాయం వల్ల ఐపీఎల్ 2026కు దూరమైన ఎడ్వర్డ్స్‌కు ఈసారి పసుపు జెర్సీలో ఆడే అవకాశం లభించనుంది.


ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ ప్లేయర్ అయిన ఖలీల్ అహ్మద్ రూ. 4.8 కోట్లకు తిరిగి ఆరెంజ్ ఆర్మీలోకి అడుగుపెడుతున్నాడు. 2018-2021 మధ్య ఎస్‌ఆర్‌హెచ్‌కే ప్రాతినిధ్యం వహించిన ఖలీల్, 2025లో సీఎస్కేకు వెళ్లి 15 వికెట్లతో మెరిశాడు. అయితే 2026లో తొడ కండరాల గాయం వల్ల 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. ఖలీల్‌తో పాటు డెత్ ఓవర్లలో రకరకాల వేరియేషన్లతో ప్రత్యర్థులను దెబ్బతీసే ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ రూ. 2 కోట్లతో ఎస్‌ఆర్‌హెచ్‌లోకి వస్తున్నాడు. ఇప్పటికే నటరాజన్ సన్‌రైజర్స్‌లోకి రాగా, తాజాగా ఖలీల్, ఎల్లిస్ చేరికతో సన్‌రైజర్స్ పేస్ విభాగం మరింత బలంగా మారనుంది.

ఈ బిగ్ స్వాప్ డీల్ వల్ల రెండు జట్లకు సరైన సమతుల్యత దక్కిందని భావిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తమ మిడిల్ ఆర్డర్‌లో హిట్టింగ్, స్పిన్ బౌలింగ్ చేయగల లివింగ్‌స్టోన్‌ను పొందడం ద్వారా ఆల్‌రౌండర్ల లోటును భర్తీ చేసుకుంది. హైదరాబాద్ ఫ్రాంచైజీ పాట్ కమిన్స్ నేతృత్వంలోని పేస్ అటాక్‌కు ఖలీల్, ఎల్లిస్ రూపంలో అనుభవజ్ఞులైన వికెట్ టేకింగ్ బౌలర్లను దక్కించుకుంది. నవంబర్ 17 రిటెన్షన్ డెడ్‌లైన్‌కు ముందే ఈ డీల్ ఖరారవ్వడంతో వేలానికి ముందు ఇరు జట్ల కాంబినేషన్లలో స్పష్టత వచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam