Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సన్‌రైజర్స్‌కు కేకేఆర్ షాక్.. ఉప్పల్‌లో ఆగిపోయిన హైదరాబాద్ విజయ పరంపర..!

సన్‌రైజర్స్‌కు కేకేఆర్ షాక్.. ఉప్పల్‌లో ఆగిపోయిన హైదరాబాద్ విజయ పరంపర..!

Telugu Samayam 3 weeks ago

పీఎల్ 2026లో డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించాలని భావించిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్రేక్ వేసింది. తొలుత బాల్‌తో సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేసి, ఆపై బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది.

దీంతో కేకేఆర్ ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో తొలి ఆరు మ్యాచులలో ఒక్క విజయం కూడా సాధించని కేకేఆర్.. తాజాగా హ్యాట్రిక్ విజయాలు సాధించి.. ట్రాక్‌లోకి వచ్చింది. మరోవైపు సన్ రైజర్స్.. 10 మ్యాచులలో నాలుగో ఓటమి నమోదు చేసింది.

ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఓ దశలో.. 71/1 (6 ఓవర్లు), 105/1 (8.5 ఓవర్లు)తో నిలిచి.. భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా తడబడింది. చివరి 9 వికెట్లను కేవలం 60 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన కేకేఆర్.. ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. ఓపెనర్లు అజింక్య రహానే (36 బంతుల్లో 43 రన్స్), ఫిన్ అలెన్ (13 బంతుల్లో 29 రన్స్) రాణించారు. తొలి వికెట్‌కు 4 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన రఘువంశీ (47 బంతుల్లో 59 పరుగులు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

రింకూ సింగ్ (11 బంతుల్లో 22 రన్స్) ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో కేకేఆర్. 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, శివంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్ తలా ఓ వికెట్ తీశారు.

ఈ విజయంతో కేకేఆర్.. తన ఖాతాలో మరో రెండు పాయింట్లు జత చేసింది. మొత్తంగా ఆ జట్టు ఆడిన 9 మ్యాచులలో మూడు విజయాలతో 8వ ప్లేసులో ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్.. 10 మ్యాచులలో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో ప్లేసులో కొనసాగుతోంది. కేకేఆర్‌తో మ్యాచులో ఓడిపోయినా.. ఆ జట్టు స్థానం మాత్రం మారలేదు. సన్ రైజర్స్ తన తర్వాతి మ్యాచులో మే 6న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam