Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్రిషపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అన్నామలై

త్రిషపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అన్నామలై

Telugu Samayam 1 week ago

మిళనాడులో రాజకీయ వాగ్వాదం మరింత ముదురుతోంది. డీఎంకే నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తమిళనాడుబీజేపీ మాజీ అధ్యక్షుడు కె.

అన్నామలై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైగై నది శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత సోషల్ మీడియాలో స్పందించిన అన్నామలై.. ఉదయనిధి స్టాలిన్ ప్రసంగాన్ని వైగై నది కాలుష్యంతో పోలుస్తూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఈ వివాదంపై ట్వీట్ చేసిన అన్నామలై.. తాను నిన్న వైగై నదిని శుభ్రం చేశానని పేర్కొన్నారు.

అయితే వైగై నదిని శుభ్రం చేస్తుండగా అందులో ఉన్న కాలుష్యం కంటే ఘోరమైన కాలుష్యం ఇంకేముంటుందా అని అనిపించిందని పేర్కొన్న అన్నామలై.. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రసంగాన్ని విన్నాను అంటూ ఎద్దేవా చేశారు. ఉదయనిధి స్టాలిన్‌పై అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


మరోవైపు.. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు మంత్రులు తీవ్రంగా ఖండించారు. రాజ్‌మోహన్, అధవ్ అర్జునా, ఆనంద్, అరుణ్‌రాజ్ వంటి మంత్రులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్ కూడా ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ స్పందించారు. టీవీకే కార్యకర్తలు, నేతలు ఉదయనిధి స్టాలిన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కావేరి జలాల సమస్యపై తంజావూరులోని పనగల్ భవనం ఎదుట డీఎంకే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి స్టాలిన్.. 8 జిల్లాలకు చెందిన డీఎంకే కార్యకర్తలు, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రసంగంలో భాగంగానే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఆ సమయంలో డీఎంకే కార్యకర్తలు త్రిష, త్రిష అంటూ చేసిన నినాదాల సమయంలో డబుల్ మీనింగ్ వచ్చేలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

ఈ వ్యవహారంలో తంజావూరు పోలీస్ స్టేషన్‌లో టీఎంకే మహిళా విభాగం ఫిర్యాదు చేయగా.. ఇవాళ పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ఇంటికి వెళ్లి అతడిని అఱెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే డీఎంకే నేతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఉదయనిధి స్టాలిన్‌ను వెంటనే విడిచిపెట్టాలని పోలీసులను ఆదేశించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam