Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ధురందర్ 2 ఎండ్ క్రెడిట్స్ సీక్రెట్. మిస్ అయితే పెద్ద ట్విస్ట్ మిస్సే!

ణవీర్ సింగ్ నటించిన 'ధురందర్: ది రివెంజ్' ప్రేక్షకుల్లో భారీ అంచనాల మధ్య విడుదలై, క్లైమాక్స్ మరియు ఎండ్-క్రెడిట్ సీన్స్ కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

రణవీర్ సింగ్ పోషించిన హమ్జా అలీ మజారీ (జస్కిరత్ సింగ్ రంగి) పాత్ర చుట్టూ కథ తిరుగుతూ, క్లైమాక్స్ ఉత్కంఠభరిత మలుపులు తీసుకుంటుంది. మురిద్కేకు చేరుకున్న హమ్జా, మేజర్ ఇక్బాల్ పాత్రలో నటించిన అర్జున్ రాంపాల్ను కలుస్తాడు. లష్కర్-ఎ-తైబా శిబిరాన్ని ధ్వంసం చేసే క్రమంలో అతను పాకిస్థాన్ దళాలకు చిక్కి, చివరకు భారతీయ గూఢచారి అని బయటపడుతుంది.

Also Read :'ఫస్ట్ టైం' మూవీ రివ్యూ

ఈ సమయంలో అజయ్ సన్యాల్ పాత్రలో కనిపించిన ఆర్. మాధవన్ తన తెలివితేటలతో పాకిస్థానీ జనరల్‌ను బ్లాక్‌మెయిల్ చేసి హమ్జాను రక్షిస్తాడు. అయితే కథలో అతిపెద్ద ట్విస్ట్ జమీల్ జమాలి పాత్ర. ఈ పాత్రను పోషించిన రాకేష్ బేడి, 50 ఏళ్లుగా పాకిస్థాన్‌లో ఉన్న రాజకీయ నాయకుడిగా అద్బుతంగా నటించారు. అతని సహాయంతో హమ్జా సురక్షితంగా భారత్ చేరుకుని, తన కుటుంబంతో జీవించాలా లేక మళ్లీ గూఢచారిగా కొనసాగాలా అనే సందిగ్ధంలో కథ ముగుస్తుంది.

Also Read :ప్రముఖ నటుడు రషీన్ రహమాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సర్ప్రైజ్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్

దర్శకుడు ఆదిత్య ధర్ ఎండ్-క్రెడిట్ సీన్స్‌లో రెండు కీలక సన్నివేశాలు చూపించారు. మొదటిది హమ్జా గూఢచారిగా మారిన ట్రైనింగ్ మాంటేజ్ కాగా, రెండవది పాకిస్థానీ జనరల్ షానవాజ్ ఆగ్రహాన్ని చూపించే చిన్న సీన్. అయితే పార్ట్ 3 గురించి ఎలాంటి స్పష్టమైన సూచనలు ఇవ్వలేదు. అయినప్పటికీ, ఓపెన్ ఎండింగ్‌తో కథను ముగించడం ద్వారా సీక్వెల్‌పై ఆసక్తిని పెంచారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi