Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

NBK112: బాలయ్య - కొరటాల సినిమాలో కోలీవుడ్ స్టార్.. పవర్‌ఫుల్ పోలీస్‌గా ఆర్య?

NBK112: నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'NBK112'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బాలయ్యతో కొరటాల శివ తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో భారీ ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే ఈ సినిమా లాంచ్ కాగా.. బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న 'NBK111' పూర్తయిన తర్వాత 'NBK112' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను సంప్రదించినట్లు ఇండస్ట్రీలో బజ్ వినిపిస్తోంది. మేకర్స్ ఆయనను ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర సాధారణ సైడ్ క్యారెక్టర్ కాదని.. కథలో కీలకమైన మలుపుకు కారణమయ్యే స్థాయిలో ఉంటుందని టాక్.

Yash-Lokesh: యశ్‌తో లోకేష్ కనగరాజ్ సినిమా? 'రాకా' ఆలస్యంతో మారిన లోకేష్ ప్లాన్!

ఆర్య ఈ మూవీలో భాగమైతే బాలకృష్ణ పాత్రతో ఆయనకు ఎలాంటి సంబంధం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ కలిసి పనిచేసే పాత్రలా ఉంటుందా? లేక ఒకరికి ఒకరు ఎదురుగా నిలిచే క్యారెక్టర్లా కనిపిస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొరటాల శివ సినిమాల్లో కథను ముందుకు నడిపించే కీలక పాత్రలు, వాటి మధ్య సంఘర్షణకు ప్రాధాన్యం ఉంటుంది. దీంతో బాలయ్య - ఆర్య కాంబినేషన్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్యకు తెలుగు ప్రేక్షకులతో ఇప్పటికే పరిచయం ఉంది. 'వరుడు'లో విలన్‌గా నటించిన ఆయన.. ఆ తర్వాత 'సైజ్ జీరో', 'సైంధవ్' వంటి సినిమాల్లోనూ కనిపించారు. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయి. ఇప్పుడు 'NBK112'లో కథకు కీలకమైన పవర్‌ఫుల్ పాత్ర దక్కితే.. టాలీవుడ్‌లో ఆర్యకు ఇది మంచి కమ్‌బ్యాక్‌గా నిలిచే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో ఆర్య క్యాస్టింగ్‌పై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi