Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Ram Charan: రామ్ చరణ్ కెరీర్‌లోనే డిఫరెంట్ రోల్.. కృష్ణుడిగా మెగాపవర్ స్టార్?

Ram Charan: గుజరాతీ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం 'లాలో: కృష్ణ సదా సహాయతే' ఇప్పుడు తెలుగులో రీమేక్ కానుందనే వార్తలు టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి.

అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం చర్చలు జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 'లాలో' కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అంతేకాకుండా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లోకి రీమేక్ చేసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రీమేక్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలో మార్పులు చేసి, సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Bhagyashri Borse: జాక్‌పాట్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. రామ్ చరణ్ సినిమాలో ఎంట్రీ?

అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అసలు క్రేజ్ మాత్రం రామ్ చరణ్ పేరు వినిపించడంతోనే మొదలైంది. ఆధ్యాత్మికత, ఆధునికత కలగలిసిన ఈ కథలో శ్రీకృష్ణుడి పాత్రలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ఇలాంటి ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 'లాలో' తెలుగు రీమేక్, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం, శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్ నటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తలు నిజమా? కేవలం ఇండస్ట్రీ బజ్ మాత్రమేనా? అనే చర్చ జరుగుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi