Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Ramayana Trailer: 'రామాయణ' ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్..

Ramayana Trailer: దర్శకుడు నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ'. ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదలైన తర్వాత సినీ అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భారతీయ ఇతిహాసాన్ని అత్యంత వైభవంగా, ఆధునిక సాంకేతికతతో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తోందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. నితేష్ తివారి విజన్‌కు బలమైన కథనం తోడవడంతో 'రామాయణ' ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకునేలా తెరకెక్కిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇతిహాసంలోని భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాలు, పాత్రల రూపకల్పనను అత్యున్నత స్థాయిలో చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తోందన్నారు.

Also Read :Dil Raju: దిల్ రాజు కొత్త స్ట్రాటజీ.. స్టార్ హీరోలతో సినిమాలకు బ్రేక్?

ఈ ట్రైలర్‌కు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. వీరిద్దరి సంగీతం ప్రతి సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అలాగే ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అందించిన వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలు ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందించిన విజువల్స్ భారతీయ సినిమాను మరో మెట్టుపై నిలబెడతాయని సినీ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకునే విజువల్ స్పెక్టకల్‌గా 'రామాయణ' నిలుస్తుందనే నమ్మకాన్ని ట్రైలర్ మరింత బలపరిచిందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఫస్ట్ పార్ట్ దీపావళి 2026 సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Also Read :Accident Insurance: అభిమానుల కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi