Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రివ్యూ : డెకాయిట్

టీనటులు: Adivi Sesh, Mrunal Thakur, Anurag Kashyap, Prakash Raj దర్శకుడు: Shaneil Deo
సంగీతం: Bheems Ceciroleo
నిర్మాతలు: Supriya, Sunil

తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5

'మేజర్', 'హిట్ 2' వంటి హిట్ సినిమాల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అడివి శేష్, ఈసారి పూర్తిగా కొత్త మేకోవర్‌తో 'డెకాయిట్' అనే ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ప్రేమ - పగ - ఎమోషన్ మేళవింపుతో ఆసక్తి రేపింది. ప్రమోషన్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచాయి.

కథ :

హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్) ఒక ఖైదీ. తన ప్రాణంగా ప్రేమించిన సరస్వతి (మృణాల్ ఠాకూర్) తనను మోసం చేసిందనే కోపంతో ఆమెపై పగ తీర్చుకోవాలని చూస్తాడు. జైలు నుంచి తప్పించుకుని ఆమె జీవితంలోకి తిరిగి అడుగుపెడతాడు. అయితే అసలు సరస్వతి ఎందుకు అతన్ని దూరం చేసింది? నిజంగా ఆమె మోసం చేసిందా? లేక ఆ వెనుక మరేదైనా కారణం ఉందా? చివరికి ఈ ప్రేమ కథ ఏ దిశగా మలుపు తిరిగింది? అనేది సినిమా చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది.

Also Read :'ఫస్ట్ టైం' మూవీ రివ్యూ

విశ్లేషణ :

సినిమా ప్రారంభం నుంచే ఆసక్తిని పెంచుతూ ఫస్ట్ హాఫ్ బాగా నడుస్తుంది. ట్విస్టులు, స్క్రీన్‌ప్లే మంచి గ్రిప్ ఇస్తాయి. కథ రొటీన్‌గా అనిపించినా, ట్రీట్మెంట్‌తో ఎంగేజ్ చేయడానికి టీమ్ ప్రయత్నించింది. అయితే సెకండ్ హాఫ్‌లో కథ కొంత స్లో అవుతుంది. కొన్ని సీన్స్ బోర్‌గా అనిపిస్తాయి. అయినా క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్‌గా బలంగా వర్కౌట్ అయ్యింది. చివరికి సినిమా హృదయాన్ని తాకేలా ముగుస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

అడివి శేష్ నటన - వన్ మ్యాన్ షో
శేష్ - మృణాల్ మధ్య కెమిస్ట్రీ
ఎమోషనల్ క్లైమాక్స్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ & సినిమాటోగ్రఫీ
కొన్ని ట్విస్టులు

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ లైన్
సెకండ్ హాఫ్ స్లోనెస్
కొన్ని లాజిక్ మిస్సింగ్ సీన్స్
మాస్ ఆడియన్స్‌కు పూర్తిగా కనెక్ట్ కాకపోవచ్చు

Also Read :'ఫస్ట్ టైం' మూవీ రివ్యూ

నటీనటుల ప్రదర్శన :

అడివి శేష్ తన పాత్రలో మరోసారి మెప్పించాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ పార్ట్‌లో కూడా తన టాలెంట్ చూపించాడు. మృణాల్ ఠాకూర్ తన పాత్రలో నేచురల్‌గా నటించింది. ప్రకాశ్ రాజ్, అనురాగ్ కశ్యప్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా అనురాగ్ కశ్యప్ నటన చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది.

టెక్నికల్ విభాగం :

దర్శకుడు శానిల్ డియో సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బలంగా నిలిచింది. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.

ఫైనల్ వెర్డిక్ట్

'డెకాయిట్' ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా. కథ కొత్తగా లేకపోయినా, నటన, టెక్నికల్ వాల్యూస్, క్లైమాక్స్ ఎమోషన్స్ సినిమాను నిలబెట్టాయి.

తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi