Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Suhas: 'మండాడి' కోసం నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం..

Suhas: యంగ్ హీరో సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'మండాడి'. పడవ పందేల నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్, డ్రామాతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహాస్ 'మండాడి' షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. 'మండాడి' క్లైమాక్స్‌ కోసం చిత్రబృందం ఏకంగా 45 రోజుల పాటు సముద్రంలో షూటింగ్ చేసినట్లు సుహాస్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం సముద్రంలోకి వెళ్లి.. సాయంత్రానికి తిరిగి వచ్చేవాళ్లమని చెప్పారు. సముద్రంలో షూటింగ్ చేయడం చాలా సవాళ్లతో కూడుకున్నదని, వాతావరణ పరిస్థితులు, అలల తీవ్రతతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని వెల్లడించారు.

NBK112: బాలయ్య - కొరటాల సినిమాలో కోలీవుడ్ స్టార్.. పవర్‌ఫుల్ పోలీస్‌గా ఆర్య?

ముఖ్యంగా షూటింగ్ సమయంలో బోట్లు తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయని సుహాస్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో నాలుగైదుసార్లు దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. "ఇక అయిపోయాం అనుకున్నాం" అంటూ ఆ సమయంలో ఎదురైన భయానక అనుభవాలను వివరించారు. తన కెరీర్‌లోనే 'మండాడి' షూటింగ్ అత్యంత రిస్క్‌తో కూడుకున్న అనుభవమని పేర్కొన్న సుహాస్.. ఇకపై ఇలాంటి లైఫ్ రిస్క్ ఉన్న సినిమాలు చేయనని స్పష్టం చేశారు. అయితే సినిమా కోసం పడిన కష్టం, ఎదుర్కొన్న సవాళ్లు తెరపై అద్భుతమైన అనుభూతిని అందిస్తాయని సుహాస్ నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పడవ పందేల నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయని తెలిపారు. 'మండాడి' సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi