Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

The Paradise: 'ది ప్యారడైజ్'పై క్లారిటీ.. సెప్టెంబర్ 24న నాని మాస్ ట్రీట్!

The Paradise: నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ది ప్యారడైజ్' మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. గత కొంతకాలంగా సినిమా విడుదల తేదీ మారుతుందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ..

మేకర్స్ అధికారికంగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లు సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి. 'దసరా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి కలిసి పనిచేస్తుండటంతో 'ది ప్యారడైజ్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి మరింత మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు హింట్ ఇస్తున్నాయి. నాని లుక్ కూడా గత సినిమాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Nagarjuna: సూర్య 49లో నాగ్.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు, కాయదు లోహర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సమాజంలో అణచివేతకు గురవుతున్న వర్గాల నేపథ్యంలో ఒక వ్యక్తి చేసే తిరుగుబాటు చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ ప్రకటనతో సోషల్ మీడియాలో నాని అభిమానులు సందడి చేస్తున్నారు. పోస్టర్లలో కనిపిస్తున్న మాస్ హీరో విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో రిలీజ్ డేట్ విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నప్పటికీ.. ఈసారి సెప్టెంబర్ 24న విడుదల ఖాయమని మేకర్స్ స్పష్టం చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రత్యేక ప్రీమియర్లతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: telugumirchi