మారుతి సుజుకి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటోమొబైల్ కంపెనీ . జూన్ 2026 నుండి కంపెనీ తమ ప్రముఖ మోడల్ వాహనాల ధరలను పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులు, గ్లోబల్ కరెన్సీ మార్పులు దిగుమతి భాగాల వ్యయాలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి సుజుకి వెల్లడించింది. ఇది 2026లో కంపెనీ రెండవసారి ధర పెంచినట్లు అవుతుంది .ఈ ధరల పెంపు వల్ల అరేనా , నెక్సా షోరూమ్‌లలోని అన్ని మోడళ్లకు వేర్వేరు స్థాయిల్లో ధరలు పెరుగుతాయి. కస్టమర్లు కొత్త వాహనం కొనుగోలు చేయాలని భావిస్తే జూన్‌కు ముందు బుకింగ్ చేయడం ద్వారా అదనపు ఖర్చునుండి తప్పించుకోవచ్చు. ధర పెంపు వల్ల డౌన్ పేమెంట్, లోన్ EMIలు కూడా ప్రభావితం అవుతాయి. కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే వారికి జూన్ కి ముందే బుక్ చేసుకోవడం బెటర్ .
ఏ మోడల్స్ ధరలు పెరగనున్నాయి
మారుతి సుజుకి తమ ప్రముఖ మోడళ్లైన డిజైర్, స్విఫ్ట్, బ్రెజ్జా తోపాటు మరిన్ని వాహనాల ధరలను త్వరలో పెంచనుంది. కంపెనీ ప్రకారం పెరుగుతున్న రవాణా ఖర్చులు, అస్థిరమైన గ్లోబల్ కరెన్సీ మార్పులు, దిగుమతి వ్యయాలు మొత్తం ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా పెంచేలా చేస్తున్నాయి . గత కొన్ని నెలలుగా మారుతి సుజుకి ఇంటర్నల్ గా వ్యయాన్ని తగ్గించుకునే చర్యలు చేపట్టినా ఖర్చుల భారం తగ్గకపోవడంతో ఈ అదనపు భారాన్ని కొంతమేర వినియోగదారులపై మోపాలని నిర్ణయించింది.
ఈ ధర పెంపు వల్ల కొత్తగా కారును కొనుగోలు చేయాలనుకునే వారికి డౌన్ పేమెంట్ , EMIలు కూడా పెరిగే అవకాశం ఉంది.జూన్ 2026కు ముందు బుకింగ్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు ధరల పెంపు నుండి తప్పించుకోవచ్చు.
మారుతి సుజుకి 2026లో తమ మోడళ్ల ధరలను పెంచడం ఇది రెండొవ సారి . ఈ సంవత్సరం ప్రారంభంలోనే కంపెనీ కొంత మేర ధర పెంపును అమలు చేసింది. అప్పుడు కూడా ఉత్పత్తి ఖర్చుల భారం కారణంగా ధరలు పెంచినట్లు సంస్థ వెల్లడించింది.
ఎంత పెంచుతున్నారు
ఇప్పటివరకు మోడల్ వారీగా ధరల వివరాలు ప్రకటించలేదు. ఈ ధర పెంపు గరిష్టంగా ₹30,000 వరకు ఉండనుంది. ఈ లెవెల్ ధర పెంపులు సాధారణంగా ప్రముఖ సెగ్మెంట్లలో చేస్తారు . అల్టో K10, ఎస్-ప్రెస్సో వంటి ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లు తక్కువ శాతం పెరుగుదల ఉండవచ్చు . బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఫ్రాంక్స్ వంటి మిడ్ రేంజ్ , ప్రీమియం మోడళ్లలో ఎక్కువ ధర పెంపు ఉండే అవకాశం ఉంటుంది .
Read more news like this on telugu.timesnownews.com

