Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మట్టి వినాయకులు వాడాలి.. మొక్కలు పంపిణీ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

మట్టి వినాయకులు వాడాలి.. మొక్కలు పంపిణీ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

V6 Velugu 2 weeks ago

ర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయక విగ్రహాలను వాడాలని, భక్తులకు మొక్కలు పంపిణీ చేయాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. సెప్టెంబర్ 14 నుంచి హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు, పోలీసులు,భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా చేనేత రంగాన్ని ప్రోత్సహించేలా చేనేత కండువాలు వాడాలని ఉత్సవ సమితిని కోరారు. వినాయక మండపాల్లో ఎల్ నినో ప్రభావం తొలగిపోయి, రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేయాలని ప్రభుత్వం తరఫున సూచించారు. కోర్టు నిబంధనలను గౌరవిస్తూనే, ప్రజలు ఎలాంటి నియంత్రణలు లేకుండా స్వచ్ఛందంగా ఉత్సవాలు జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

50 శాతం బడ్జెట్ క్రెన్స్ కి : జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్

బాలాపూర్ జీహెచ్ఎంసీ లోకి వచ్చింది. పోలీస్, ట్రాఫిక్ అధికారులతో సమన్వయము తో ముందుకు వెళుతున్నాం. ఎమర్జెన్సీ క్రెన్స్ అడుగుతున్నారు,ప్రొవైడ్ చేసేలా చూసుకుంటాం. రౌండ్ క్లాక్ సానిటేషన్, వర్కర్స్ ఉంటారు. మొబైల్ టాయిలెట్స్, ప్రొసీషన్స్ రూట్స్ లో రోడ్ రేపైర్ వర్క్స్ , ట్రీ కట్టింగ్స్, క్రెన్స్, శానిటేషన్, క్లీనింగ్, నిమర్జనం పాండ్స్, అన్ని చూసుకుంటున్నాం. జోనల్ లెవల్ నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళుతున్నాం. మండపాల వద్ద ప్రసాదం రూపంలో తులసి వంటి మొక్కలు ఇచ్చేదుకు చూస్తున్నాం. పేపర్ గన్స్ తో క్లీనింగ్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి...లాస్ట్ ఇయర్ ఒకరు చనిపోయారు,పేపర్ గన్స్ లేకుండా చూసుకోవాలి.. స్ట్రీట్ లైట్స్ విషయంలో ప్లాన్ చేసుకోండి.

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు.. డీజేలు పూర్తిగా బ్యాన్ చేయాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News