Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పది రోజుల పెద్ద పండుగ.. వినాయకచవితి.. ప్రతి వీధిలో  యువత సందడి

పది రోజుల పెద్ద పండుగ.. వినాయకచవితి.. ప్రతి వీధిలో యువత సందడి

V6 Velugu 4 hrs ago

వినాయక చవితి పండగ వస్తోంది... ఇక ప్రతి నగరం, పట్టణం, గ్రామం పండగ శోభతో కళకళలాడతాయి. వీధి వీధిలో బొజ్జ గణపయ్య విగ్రహాలు కొలువుదీరతాయి.. వాడవాడా విద్యుత్ కాంతులతో మెరిసిపోతాయి.

ఇక వినాయక మండపాల వద్ద యువత సందడి మామూలుగా ఉండదు... ఆటాపాటలతో పండగ సంబరాలు అంబరాన్నంటుతాయి.

విఘ్నేశ్వరుడు, గణేశుడు, గణపతి, గజాననుడు, లంబోదరుడు, ఏకదంతుడు.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా.. విఘ్నాలను తొలగించే దేవుడు వినాయకుడే. ఆది దంపతులు శివ పార్వతుల పెద్ద కుమారుడు వినాయకుడు గురించి స్కంద పురాణం, గణేశ పురాణం, శివపురాణం, వరాహ పురాణం.. ఇలా ఎన్నో పురాణాల్లో కథలున్నాయి. స్కంద పురాణంలోని కథే వినాయక వ్రత కల్పంలోని కథ..

స్వర్గంలోకంలోని దేవుళ్లందరూ విఘ్నాలకు ఒక అధిపతి కావాలని కైలాశానికి బయలుదేరి శివుడిని కోరితే, ఆయన వినాయకుడిని విఘ్నాధిపతిగా ఎంపిక చేశాడు. వినాయకుడు పెట్టే విఘ్నాలను తప్పించుకొని ఆ పనులు పూర్తి చేయడం మానవులు ఎవ్వరికైనా కష్టమైన పనే. అందుకే ఏ పని మొదలు పెట్టినావినాయకుడికే ముందు పూజ చేస్తారు. త్రిమూర్తులుగా చెప్పుకునే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా వినాయకుడిని పూజించారని పురాణాల్లో ఉన్నట్లు చెబుతున్నారు పండితులు.

వినాయకుడు విఘ్నాతిపతిగా అవతరించిన రోజే వినాయక చవితి పది రోజుల పెద్ద పండుగ. భాద్రపద మాసం చతుర్ది (చవితి) రోజున విఘ్నాతిపతిగా అవతరించాడు వినాయకుడు. ఇంగ్లిష్ క్యాలెండర్​ ప్రకారం ఈ ఏడాది ( 2026) సెప్టెంబర్​ 14 న వచ్చింది.

"శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే"

అంటే తెల్లటి వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టి తోడి ముఖంగలవాడు అయిన వినాయకుడిని అన్ని అడ్డంకులు తొలగించమని కోరడం. దేవతల్లో ఎవరికీ లేనన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి, అందరికంటే ముందే పూజలు అందుకుంటాడు వినాయకుడు.

సెప్టెంబర్14వ తేదీనే వినాయక చవితి.. విగ్రహ పూజ ముహూర్త సమయం ఇదే..!

వినాయక చవితి రోజు ఇంట్లో, వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. పది రోజుల పాటు వైభవంగా పూజలు నిర్వహించి పదకొండో రోజు దగ్గర లోని నది, చెరువు, సరస్సుల్లో నిమజ్జనం చేస్తారు. ఇక్కడితో ఈ పండుగ అయిపోతుంది. ఈ పండుగ ఉద్దేశం ఆ దేవుడిని భూమ్మీదకి రప్పించి, వైభవంగా ఆయనకు ఉత్సవం చేసి తిరిగి ఆయనను తన లోకానికి పంపించడం. భక్తి, శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవం నిర్వహిస్తే, ఎంతో మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ సమయంలో ఏదైనా పని మొదలుపెడితే అది విజయవంతంగా పూర్తవుతుందని విశ్వసిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News