Dailyhunt
పిల్లల మరణాలకు 10వ కారణం 'క్యాన్సర్': తాజా అధ్యయనంలో ఆందోళనకర విషయాలు

పిల్లల మరణాలకు 10వ కారణం 'క్యాన్సర్': తాజా అధ్యయనంలో ఆందోళనకర విషయాలు

V6 Velugu 3 weeks ago

ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక పెద్ద అధ్యయనం (GBD 2023) ప్రకారం, భారతదేశంలో పిల్లలు చనిపోవడానికి ముఖ్య కారణాల్లో క్యాన్సర్ 10వ స్థానంలో ఉంది. ఒకప్పుడు కేవలం అంటువ్యాధుల వల్లే పిల్లలు చనిపోయేవారు, కానీ ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి కూడా వారి ప్రాణాలను తీస్తోంది.

కేవలం 2023లోనే ప్రపంచవ్యాప్తంగా అంచనా ప్రకారం 3,77,000 కొత్త బాల్య క్యాన్సర్ కేసులు, 1,44,000 మరణాలు సంభవించాయి. 2023 ఒక్క ఏడాదిలోనే మన దేశంలో సుమారు 17,000 మంది పిల్లలు క్యాన్సర్ వల్ల చనిపోయారని అంచనా.

ఇక ప్రపంచం మొత్తం మీద చూస్తే, పిల్లల మరణాలకు క్యాన్సర్ 8వ ముఖ్య కారణం. క్యాన్సర్ క్షయ (TB), ఎయిడ్స్ వంటి వ్యాధుల కంటే కూడా ప్రమాదకరంగా మారింది. పెద్దవారిలో వచ్చే క్యాన్సర్ కంటే, పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువ, అలాగే వారి ప్రాణాలు దక్కించుకోవచ్చు.

గమనించాల్సిన లక్షణాలు:
పిల్లల్లో చాలా కాలం పాటు జ్వరం తగ్గకపోవడం, కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, శరీరంపై ఎక్కడైనా గడ్డలు రావడం, విపరీతమైన అలసట లేదా ఒళ్లు నొప్పులు సమస్యలు ఉంటే వెంటనే డాక్టరుకు చూపించాలి. చాలా సందర్భాల్లో వ్యాధి ముదిరిపోయిన తర్వాతే హాస్పిటల్‌కు వస్తుంటారు. దీనివల్ల ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది.

అయితే క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేకమైన ఆస్పత్రులు, ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. మన దేశంలో ప్రభుత్వ క్యాన్సర్ నివారణ కార్యక్రమాలు ఎక్కువగా పెద్దవారిపైనే దృష్టి పెడుతున్నాయి. పిల్లల క్యాన్సర్ల గురించి ఇంకా పటిష్టమైన ప్లాన్ రావాల్సి ఉంది.

ALSO READ : బెల్లీ ఫ్యాట్ తో ప్రతి 10మంది మహిళల్లో ఆరుగురికి ముప్పు!

పిల్లల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రకాలు:
*లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ మెదడు ఇంకా నరాలకు సంబంధించినది.
*లింఫోమా అంటే రోగనిరోధక వ్యవస్థకు సంబంధించినది

పిల్లల్లో క్యాన్సర్ అనేది వినడానికి భయంగా ఉన్నా, భయపడటం కంటే అవగాహన పెంచుకోవడం ముఖ్యం. ప్రభుత్వం పిల్లల కోసం ప్రత్యేక చికిత్స కేంద్రాలను పెంచాలని, తల్లిదండ్రులు చిన్నపాటి మార్పులను గమనించి త్వరగా డాక్టరును సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News