Ram Mohan Naidu On Airports : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు రానున్న దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు.
అందుకోసం సుమారు రూ.30,000 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 2014 నాటికి దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 166కు చేరింది. గత 12 ఏళ్లలో దాదాపు ప్రతి 40 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం లేదా టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది.
Read Also: Reliance Ice cream : ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్..'బాంబే క్రీమరీ' క్రీమ్ బ్రాండ్
Ram Mohan Naidu On Airports
సవరించిన ‘ఉడాన్’ పథకానికి రూ.28,840 కోట్లు
ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మరింత వేగవంతం చేసేందుకు ‘ప్రాంతీయ అనుసంధాన పథకం-సవరించిన ఉడాన్’కు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు (పదేళ్ల పాటు). రూ.28,840 కోట్ల కేంద్ర బడ్జెట్ మద్దతు. మారుమూల ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాలు, లక్షద్వీప్, అండమాన్ దీవులను ప్రధాన విమాన నెట్‌వర్క్‌తో అనుసంధానించడం. గతంలో ప్రజలు రైల్వే సదుపాయాల కోసం విజ్ఞప్తులు చేసేవారని, కానీ ప్రస్తుతం టైర్-2, టైర్-3 నగరాలతో పాటు చిన్న పట్టణాల ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో విమానాశ్రయాలు కావాలని కోరుతున్నారని మంత్రి తెలిపారు. పౌర విమానయాన రంగం నేడు అత్యంత వేగంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు.
Ram Mohan Naidu On Airports : ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్ మరియు అంతర్జాతీయ కనెక్టివిటీ
చిన్న నగరాల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు సులభతరం చేసేందుకు ‘హబ్ అండ్ స్పోక్’ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. పెద్ద నగరాలలోని ప్రధాన విమానాశ్రయాలను ‘హబ్’లుగా వినియోగిస్తారు.చిన్న నగరాలను ఈ హబ్‌లతో ‘స్పోక్’ విధానం ద్వారా అనుసంధానిస్తారు. దిల్లీ తర్వాత ఈ సేవలను వారణాసి, అమృత్‌సర్‌లలో విజయవంతంగా ప్రారంభించారు. తాజాగా అహ్మదాబాద్‌ను మూడో ప్రధాన కేంద్రంగా ఎంపిక చేసి, కార్యకలాపాలను ప్రారంభించారు. విమానయాన రంగం కేవలం రవాణాకే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడానికి తోడ్పడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఒక విమానాశ్రయం ఏర్పాటుతో దాని చుట్టుపక్కల ప్రాంతాలు, వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి తదితరులు పాల్గొన్నారు.
Epaper: epaper.vaartha.com

