Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
104 సంచార వైద్య వాహనాల్లో మందుల సరఫరా మరింత పటిష్టం

104 సంచార వైద్య వాహనాల్లో మందుల సరఫరా మరింత పటిష్టం

వార్త 2 months ago

ఇ-ఔషధిలో తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు

Dr NTR Vaidya Seva Trust: రాష్ట్రంలోని 104 సంచార వైద్య వాహనాలకు మందులు, సర్జికల్స్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్ట పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈ వాహనాల్లో గ్రామాలకు వెళ్లి రోగులకు మందులు పంపిణీ చేస్తారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి మందులు, సర్జికల్స్ సరఫరాకు సంబంధించిన స్టాకు వివరాల్ని ఇ-ఔషది పోర్టల్ లో తప్పనిసరిగా నమోదు చేయాలన్న వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ ఆదేశాల మేరకు ఈ విధానంపై రెండు రోజులపాటు రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిం చారు.

Read Also: Annamayya District: అడ్వకేట్ ఎల్లయ్య దారుణ హత్య.. అసలేం జరిగింది?

 Steps to make registration in e-medicine mandatory.. Health Department orders

Dr NTR Vaidya Seva Trust: శిక్షణా కార్యక్రమం

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రా స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు 104 సంచార వైద్య వాహనాల డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జిల్లాల్లో శిక్షణ ఇస్తారని సి-డాక్ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ పసుపులేటి అశ్విని నేడొక ప్రకటనలో తెలిపారు. 104 సంచార వైద్య వాహనాల విభాగంలో పనిచేసే జిల్లా, రీజినల్ మేనేజర్లు, ఆపరేషన్స్ ఆగ్జిక్యూటివ్లకు శిక్షణ ఇచ్చామని ఆమె తెలిపారు. ఆన్లైన్లో స్టాకు వివరాలు అందుబాటులో ఉండడం వల్ల మందులు సర్జికల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రెండు రోజుల్లో డెలివరీ అని ప్రకటనలు.. అమలులో 15 రోజులకంటే పై మాటే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha