Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అడ్వకేట్ ఎల్లయ్య దారుణ హత్య.. అసలేం జరిగింది?

అడ్వకేట్ ఎల్లయ్య దారుణ హత్య.. అసలేం జరిగింది?

వార్త 2 months ago

Annamayya District: అన్నమయ్య జిల్లా కె.వి. పల్లి మండలంలోని తీతవగుంటవల్లి పంచాయతీ పాత వడ్డిపల్లికి చెందిన పూజారి అడ్వకేట్ ఎల్లయ్య (40) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.

సోమవారం సాయంత్రం అదేపల్లెకు చెందిన శ్రీనివాసులు తదితరులతో ఊరిలో ట్రాన్స్ ఫార్మర్ విషయమై ఘర్షణ పడ్డారు. అనంతరం వారు బయటకు వెళ్లిపోయి రాత్రి 11 గంటల సమయంలో అడ్వకేట్ ఇంటిపైకి వచ్చారు. ట్రాన్స్ ఫార్మర్ విషయంలో కోపం పెంచుకున్న నిందితులు పూజారి ఎల్లయ్యను బయటకు తీసుకువచ్చి రాళ్లతో కొట్టి చంపారు.

Read also: Breaking news: Harish Rao House Arrest: మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్

Advocate Ellayya murder case investigation

Annamayya District: అర్థరాత్రి వేళ రాళ్లతో దాడి

ఘటనకు సంబంధించిన వివరాలను రాయచోటి డిఎస్పి కృష్ణమోహన్ విలేకరులకు వివరించారు. అతని తల్లిదండ్రులకు తీవ్రగాయాలు కావడంతో పీలేరులో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని డిఎస్పి పేర్కొన్నారు. మృతుని తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డిఎస్పి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

HRC ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha