Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
125 ఏళ్లలోనే దేశంలో అత్యల్ప వర్షపాతం

125 ఏళ్లలోనే దేశంలో అత్యల్ప వర్షపాతం

వార్త 4 days ago

El Niño Effect : దేశంలో 'ఎల్నినో' (సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం) ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి. జూన్ నెల దాదాపు ముగింపునకు వచ్చినా ఆశించిన స్థాయిలో రుతుపవనాలు కదక్కపోవడంతో దేశవ్యాప్తంగా వర్షాలు ముఖం చాటేశాయి.

వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. జూన్ 1 నుండి జూన్ 28 వరకు దేశంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 149.8 mm కాగా, ఈసారి కేవలం 85.2 mm మాత్రమే నమోదైంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఏకంగా 43 శాతం మేర భారీ వర్షపాత లోటు ఏర్పడింది. ఈ అసాధారణ వాతావరణ మార్పుల తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని మొత్తం 724 జిల్లాలకు గాను 315 జిల్లాల్లో ఎల్నినో ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది.

 El Nino Effect India

గత రికార్డులను బద్దలు కొట్టిన కరవు పరిస్థితులు.. ఆందోళనలో అన్నదాతలు

ప్రస్తుతం నమోదైన ఈ 85.2 mm వర్షపాతం అనేది గత 125 సంవత్సరాల దేశ చరిత్రలోనే అత్యంత తక్కువ కావడం గమనార్హం. గతంలో కరవు పరిస్థితులు ఏర్పడిన ఏటా ఇంతకంటే ఎక్కువే వర్షపాతం నమోదైంది. వాతావరణ రికార్డులను పరిశీలిస్తే.. గతంలో తీవ్ర కరవు నెలకొన్న 1901లో 87.4 mm, 1926లో 100 mm, 2009లో 87.5 mm, అలాగే 2014లో 95.3 mm చొప్పున వర్షపాతం రికార్డయ్యింది. కానీ, ఈ ఏడాది వాటన్నింటికంటే తక్కువ వర్షాలు కురవడంతో దేశంలో మునుపెన్నడూ లేనంతగా నీటి ఎద్దడి, సాగు సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. జూన్ నెలలోనే వర్షాలు ఇంతలా నమ్మకద్రోహం చేయడంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభించాల్సిన అన్నదాతలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.

జూలై 1 నుంచి ఇవన్నీ మారనున్నాయి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha