Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జూలై 1 నుంచి ఇవన్నీ మారనున్నాయి

జూలై 1 నుంచి ఇవన్నీ మారనున్నాయి

వార్త 5 days ago

July 1 New Rules: ఎల్లుండి (జూలై 1) నుండి దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల జేబులపై ప్రభావం చూపేలా మరియు రోజువారీ సేవా విధివిధానాల్లో పలు కీలక మార్పులు (Key Changes From July 1 2026) అమలు కానున్నాయి.

ప్రధానంగా పాస్‌పోర్ట్ సేవా రుసుములు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు మరియు ఆధార్ కార్డు ఉచిత సేవల పొడిగింపునకు సంబంధించిన మార్పులు ఇందులో ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోకపోతే అదనపు పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం మరియు సంబంధిత శాఖలు జారీ చేసిన నూతన మార్గదర్శకాల సమగ్ర వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

Read Also: Population : జనాభాలో ఎక్కువ.. ప్రగతి ప్రమాణాల్లో తక్కువ

పాస్‌పోర్ట్ రుసుముల పెంపు - జూలై 1 నుండి అమలు

విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. జూలై 1వ తేదీ నుండి భారతదేశంతో పాటు విదేశాల్లో (India and Overseas) జారీ చేసే పాస్‌పోర్ట్ ఫీజులను కేంద్రం భారీగా పెంచనుంది. ఈ నూతన ధరల సవరణ సాధారణ (Normal) పాస్‌పోర్ట్‌లతో పాటు అత్యవసరంగా తీసుకునే తత్కాల్ (Tatkal) పాస్‌పోర్ట్ సేవలకు కూడా వర్తించనుంది. జూన్ 30 తర్వాత పాస్‌పోర్ట్ స్లాట్ బుక్ చేసుకునే లేదా దరఖాస్తు చేసుకునే వారంతా సవరించిన నూతన గరిష్ట రుసుములను చెల్లించాల్సి ఉంటుంది.

డిసెంబర్ 31 వరకు ఆధార్ యాప్‌లో ఉచిత ఈమెయిల్ అప్‌డేషన్

ఆధార్ వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక తీపి కబురు అందించింది. జూలై 1వ తేదీ నుండి 2026 డిసెంబర్ 31 వరకు అధికారిక ఆధార్ మొబైల్ యాప్ (mAadhaar App) ద్వారా తమ ఆధార్ కార్డుకు ఈమెయిల్ ఐడీని అనుసంధానం లేదా అప్‌డేట్ (Email Address Updation) చేసుకునే ప్రక్రియను పూర్తిగా ఉచితం చేసింది. ఈ ఆరు నెలల ప్రత్యేక గడువులోగా వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించకుండా తమ ఈమెయిల్ వివరాలను డిజిటల్‌గా ఇంట్లోనే కూర్చుని అప్‌డేట్ చేసుకోవచ్చు.

July 1 New Rules: ఐటీఆర్ (ITR) దాఖలుకు వచ్చే నెల 31 ఆఖరి గడువు

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు విధిగా గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఆర్థిక సంవత్సరం 2025-26 (అసెస్మెంట్ ఇయర్ 2026-27) కి సంబంధించి ఐటీఆర్-1 (ITR-1) మరియు ఐటీఆర్-2 (ITR-2) ఫైల్ చేసే జీతభత్యాలు, ఇతర ఆదాయాలు కలిగిన పౌరులంతా వచ్చే జూలై 31వ తేదీ లోగా తమ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌ను ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. ఈ గడువు దాటితే భారీగా లేట్ ఫీజు (Late Fine) మరియు వడ్డీలు చెల్లించాల్సి ఉంటుందని ఐటీ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

Epaper: epaper.vaartha.com

జూలై 1 నుంచి మారనున్న రూల్స్.. సామాన్యుడిపై ప్రభావం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha