Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
134 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుమతి ఇవ్వలేదు

134 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుమతి ఇవ్వలేదు

వార్త 1 week ago

Telangana Inter Board: రాష్ట్రంలో కొనసాగుతున్న 436 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 302 జూనియర్ కాలేజీలకు మాత్రమే ఇంటర్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి అనుమతి ఇచ్చింది.

ఇంకా 134 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు ఈ ఏడాది అనుబంద గుర్తింపును ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో 209 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుమతి ఇవ్వగా.. 16 జిల్లాల్లో ఒక్క ప్రైవేటు జూనియర్ కాలేజీకి కూడా ఇంటర్ బోర్డు గుర్తిం వును ఇవ్వలేదు.

Read Also: Kalvakuntla Kavitha: ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటుపై కవిత లేఖ!

 Inter board has not given permission to 134 government junior colleges

Telangana Inter Board: ముగిసిన అడ్మిషన్ల షెడ్యూల్

2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరడానికి ఇంటర్ బోర్డు ప్రకటించిన అడ్మిషన్ షెడ్యూల్ మే 31(ఆదివారం)తో ముగిసింది. అయినప్పటికీ రాష్ట్రంలో కొనసాగుతున్న కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు జూనియర్ కాలేజీలకు సైతం ఇంటర్ బోర్డు ఈ ఏడాది అనుబంధ గుర్తింపును ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ బోర్డు 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఇచ్చింది. ఈ ఏడాది ఆదివారం(మే31) సాయంత్రం నాటికి 302 కాలేజీలకు మాత్రమే అనుబంధ గుర్తింపును ఇచ్చినట్టు బోర్డు అధికారిక వెబ్సైట్లో ప్రచురించింది. అలాగే ప్రైవేటు జూనియర్ కాలేజీలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరంలో 1405 కాలేజీలకు అనుమతి ఇవ్వగా మే 31 నాటికి కేవలం 209 కాలేజీలకు మాత్రమే గుర్తింపును ఇచ్చింది.

నిబంధనల ప్రకారమే గుర్తింపు ప్రక్రియ

గుర్తింపు పొందని కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం సరైన పత్రాలు. సమర్పించకపోతే గుర్తింపు ప్రక్రియ పెండింగ్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అనుబంధ ప్రక్రియ అనేది నిరంతరమైన, నిబంధనల పాటింపుతో కూడిన ఒక ప్రక్రియ అని, కేవలం వేగం కోసం దీనిని కుదించడం గానీ, దాటవేయడంగానీ సాధ్యం కాదని చెబుతున్న ఇంటర్ బోర్డు అధికారులు.. అనుబంధ గుర్తింపు మంజూరు చేయడానికి ముందు ప్రతి సంస్థ నిర్దేశించిన విద్యా, మౌలిక సదుపాయాల, పరిపాలనా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర సందిగ్ధం

విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు ఈ ప్రక్రియ సకాలంలో పూర్తయ్యేలా చూసేందుకు బోర్డు తనిఖీ బృందాలు చురుకుగా క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ, దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలిస్తున్నాయని అధికారులు ప్రకటించినప్పటికీ.. అడ్మిషన్ల గడువు మే 31తోనే ముగియడంతో ఇటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు, అటు ప్రైవేటు జూనియర్ కాలేజీలకు పూర్తిస్థాయిలో అనుబంద గురింపు లేకపోవడంతో ఎక్కడా చేరాలనే సందిగ్ధంలో విద్యార్థులు, వారిని ఎక్కడా చేర్పించాలనే మీమాంశలో తల్లిదండ్రులు ఉన్నారు. రాష్ట్రంలోని 134 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోవడం కోసం ఇంటర్ బోర్డు అధికారులను వార్త ప్రతినిధి సంప్రదించగా.. వారు సమాధానం ఇవ్వలేదు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం మే 11న ఇంటర్ బోర్డు షెడ్యూల్ను జారీ చేసింది. మే 12 నుంచి అడ్మిషన్లను చేసుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. అనుమతి ఉన్న కాలేజీల్లోనే చేరాలని ఇంటర్ బోర్డు స్పష్టంగా పేర్కొంటూ.. అనుమతి లేని కాలేజీల్లో చేరి విద్యార్థులు ఇబ్బందులు పడోద్దని ఇంటర్ బోర్డు విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించింది. మే 12 నుంచి 31 వరకు దరఖాస్తులను స్వీకరించాలని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

విద్యార్థి సంఘాల ఆగ్రహం, ఆందోళన

మే 31 సాయంత్రం 7 గంటల వరకు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో కేవలం 209 (ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మాత్రమే అనుమతి ఉన్నట్టు ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ప్రకటించింది. వాటిలో హైదరాబాద్లో 40 కాలేజీలకు, రంగారెడ్డిలో 46 కాలేజీలకు, మేడ్చల్ జిల్లాలో 58 కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ మూడు జిల్లాల్లోనే 144 కాలేజీలకు అనుమతి ఇవ్వగా.. మిగిలిన 14 జిల్లాల్లో 65 కాలేజీలకు అనుమతి ఇచ్చారు. మిగిలిన 16 జిల్లాల్లో ఒక్క (ప్రైవేటు జూనియర్ కాలేజీకి కూడా ఇంటర్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. 2026-27 ລ້ລ້ ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇప్పటి వరకు రానప్పటికీ చాలా కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లను పూర్తి చేశాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంటర్ బోర్డు అడ్మిషన్ల నోటిఫికేషన్ను కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఇవ్వకుండానే జారీ చేసిందని.. ఇప్పుడు విద్యార్థులు చేరిన కాలేజీలకు ఈ ఏడాది ఇంటర్ బోర్డు గుర్తింపు రాకపోతే వారి పరిస్థితి ఏమిటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కొత్త ఆధార్ యాప్.. మీ డిజిటల్ గుర్తింపు ఇక మరింత సురక్షితం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha