Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటుపై కవిత లేఖ!

ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటుపై కవిత లేఖ!

వార్త 1 week ago

Kalvakuntla Kavitha: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారమని నమ్మి, తన జీవితాంతం అవిశ్రాంతంగా పోరాడిన మహనీయుడు జయశంకర్ సార్ అని ఆమె కొనియాడారు.

Read Also: Yennam Srinivas Reddy: నేడు సిట్ విచారణకు ప్రభుత్వ విప్ యెన్నం

 A poetic letter on the installation of Professor Jayashankar’s statue on Tank Bund!

Kalvakuntla Kavitha: 12 ఏళ్లయినా దక్కని గౌరవం.. చారిత్రక అవసరమిది!

తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమై దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా, ఇంతటి మహనీయుని విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో అధికారికంగా ప్రతిష్టించలేకపోవడం దురదృష్టకరమని కవిత పేర్కొన్నారు. జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవానికి ప్రతీక. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్‌పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించడం ఒక చారిత్రక అవసరం. ఈ చారిత్రక బాధ్యతను స్వీకరించేందుకు 'తెలంగాణ జాగృతి' సిద్ధంగా ఉందని, అందుకు ప్రభుత్వ అనుమతి కావాలని అభ్యర్థించారు.

పచ్చదనం, నిర్వహణ బాధ్యత మాదే..

విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు ఆ ప్రాంగణం యొక్క సంరక్షణ బాధ్యతలను కూడా తామే చూసుకుంటామని తెలంగాణ జాగృతి స్పష్టం చేసింది. విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంగణంలో పచ్చదనాన్నిపెంపొందించడం. సదరు ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్ది, నిరంతరం నిర్వహించే బాధ్యతను సంస్థే పూర్తిగా భరిస్తుంది.

ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి రోజైన ఆగస్టు 6వ తేదీ లోగా ఈ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ లోపుగా అన్ని రకాల అధికారిక అనుమతులు మంజూరు చేసి, విగ్రహ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆసిఫాబాద్ జిల్లాలో నేడు సిఎం రేవంత్ పర్యటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha