Vaibhav Suryavanshi Debut: భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయి నమోదైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ భారత జాతీయ జట్టు (Team India) జెర్సీని ధరించాడు. ఈ అరంగేట్రంతో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, మహిళా క్రికెట్ స్టార్ షఫాలీ వర్మ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డులను తిరగరాస్తూ.. భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన (Youngest Indian Cricketer) ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ ఆల్-టైమ్ రికార్డు సృష్టించాడు.
Read Also:IND vs ENG T20: రెండో టీ20లో టీమిండియా ఓటమి

నిరీక్షణకు తెర.. అరంగేట్రం మ్యాచ్‌లో ఎలా ఆడాడంటే?
గత ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వస్తాడని భావించినా అవకాశం దక్కలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లోనూ అతడిని బెంచ్‌కే పరిమితం చేయడంతో అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది. అయితే, రెండో టీ20 తుది జట్టులో వైభవ్‌కు చోటు దక్కడంతో మైదానంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒత్తిడితో కూడిన ఈ మ్యాచ్‌లో వన్ డౌన్ స్థానంలో బరిలోకి దిగిన ఈ యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్, 1 సిక్సర్‌తో 14 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ, వైభవ్ చారిత్రాత్మక అరంగేట్రమే క్రికెట్ ప్రపంచంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైభవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్:
మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియా వేదికగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టీమిండియా జెర్సీ ధరించిన ఫొటోను షేర్ చేస్తూ ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టాడు.
వైభవ్ ఇన్‌స్టా పోస్ట్: “నాకు వస్తున్న అభినందన సందేశాలు చూసి చాలా సంతోషంగా ఉంది. నాపై ఇంతటి ప్రేమ, అపారమైన మద్దతు చూపిన ప్రతి ఒక్కరికీ, నా శ్రేయోభిలాషులకు, సీనియర్ క్రికెటర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జట్టు విజయం కోసం నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఎల్లప్పుడూ శ్రమిస్తాను.” ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే నెట్టింట విపరీతంగా వైరల్ అవ్వగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Vaibhav Suryavanshi Debut: మ్యాచ్ విశేషాలు: చేజారిన విజయం.. ఇంగ్లండ్ బోణీ!
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు ప్రారంభంలోనే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గట్టి షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి భారత్‌కు ఆధిక్యాన్ని ఇచ్చాడు. అయితే, మిడిల్ ఓవర్లలో హ్యారీ బ్రూక్ (15 బంతుల్లో 39) మెరుపు ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను కోలుకునేలా చేయగా, యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ (46 బంతుల్లో 76 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చాడు. టామ్ బాంటన్ (39) కూడా రాణించాడు. ముఖ్యంగా భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్‌లో రెండు నో-బాల్స్‌తో సహా ఏకంగా 29 పరుగులు రావడం మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు పూర్తిగా తిప్పేసింది. దీంతో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది (తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది).
Epaper: epaper.vaartha.com

