Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
1,500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

1,500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

వార్త 1 month ago

Conductor Jobs : తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. టీజీఆర్టీసీ (TGRTC) లో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి సర్కార్ పచ్చజెండా ఊపింది.

ప్రభుత్వ అనుమతి లభించడంతో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం పదో తరగతి (10th Class) లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల తక్కువ సమయంలోనే పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడానికి మార్గం సుగమం కానుంది.

గ్రేడింగ్ వర్సెస్ మార్కులు – ఎస్సెస్సీ బోర్డుతో ఆర్టీసీ కసరత్తు

అయితే, ఈ మెరిట్ ఆధారిత ఎంపిక ప్రక్రియలో ఆర్టీసీ యాజమాన్యానికి ఒక సాంకేతిక సమస్య ఎదురైంది. గతంలో పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మార్కుల విధానం ఉండగా, ఇటీవలి సంవత్సరాలలో పాసైన వారికి జీపీఏ (GPA) గ్రేడింగ్ పాయింట్ల విధానం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పాత విద్యార్థుల మార్కులను, కొత్త అభ్యర్థుల గ్రేడింగ్ పాయింట్లను ఒకే త్రాటిపైకి తెచ్చి మెరిట్ లిస్ట్ ఎలా తయారు చేయాలనే దానిపై స్పష్టత కోసం ఆర్టీసీ అధికారులు ఎస్సెస్సీ (SSC) బోర్డుకు లేఖ రాశారు. గ్రేడింగ్‌ను ఖచ్చితమైన మార్కుల శాతంగా (Percentage) మార్చడానికి అనువైన ఫార్ములాను రూపొందించేలా విద్యాశాఖ అధికారులతో కలిసి ప్రస్తుతం ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఈ సమస్య కొలిక్కి రాగానే పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు అవాస్తవాలు మాట్లాడుతున్నారు: జగ్గారెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha