Lalit Modi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ ఛైర్మన్ మరియు ఈ క్యాష్-రిచ్ లీగ్ సృష్టికర్త లలిత్ మోదీ దాదాపు 16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారతదేశానికి రాబోతున్నారు.
2009లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఐపీఎల్ టోర్నీకి సంబంధించిన విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కేసులో అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆయనకు అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాను మళ్లీ స్వదేశంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆయన భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది.

ట్రైబ్యునల్ ఇచ్చిన కీలక తీర్పు - ఈడీకి గట్టి ఎదురుదెబ్బ
2009లో భారత్‌లో ఎన్నికల కారణాల వల్ల ఐపీఎల్ టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికాకు తరలించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విదేశీ నిధుల బదిలీలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయనపై కేసు నమోదు చేసింది. అయితే, తాజాగా విచారణ చేపట్టిన అప్పీలేట్ ట్రైబ్యునల్… ఆ నిధుల మార్పిడి ‘కరెంట్ అకౌంట్’ లావాదేవీల కిందకే వస్తుందని, ‘క్యాపిటల్ అకౌంట్’ కిందకు రాదని స్పష్టం చేసింది. ఈడీ మోపిన ఆరోపణల్లో ఎటువంటి బలం లేదని తేల్చిచెప్పడంతో, ఆయనపై మోపిన ప్రధాన జరిమానాలు మరియు ఆరోపణలన్నీ రద్దయ్యాయి.
Lalit Modi: నా నిర్దోషిత్వం నిరూపితమైంది: లలిత్ మోదీ స్పందన
ఈ తీర్పుపై స్పందించిన లలిత్ మోదీ, 16 ఏళ్లుగా తాను చెబుతున్న వాదనలే నిజమని ఇప్పుడు న్యాయస్థానం ద్వారా నిరూపితమయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్‌ను ఒక అగ్రగామి లీగ్‌గా నిలబెట్టడమే తన ఏకైక లక్ష్యమని, ఆ అధ్యాయం ఇప్పుడు విజయవంతంగా ముగిసిందని వ్యాఖ్యానించారు. అక్టోబర్ నెలలో తన కుమార్తెకు సంతానం కలిగిన తర్వాత, పండంటి మనవడు/మనవరాలితో కలసి భారత్‌కు రావాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిపారు.
2010 నుంచి విదేశాల్లోనే లలిత్ మోదీ ప్రస్థానం
ఆర్థిక అక్రమాల ఆరోపణల నేపథ్యంలో 2010లో లలిత్ మోదీ భారతదేశాన్ని విడిచి లండన్‌కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈడీతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఆదాయపు పన్ను శాఖ (Income Tax) కూడా ఆయనపై పలు కోణాల్లో విచారణలు జరిపాయి. ఇన్నాళ్లూ విదేశాలకే పరిమితమైన ఆయనకు, తాజాగా అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన్ ఉపశమనం భారత్‌లోకి పునఃప్రవేశానికి మార్గాన్ని సుగమం చేసింది.
హాకీ ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్

