Hockey World Cup 2026: బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న పురుషుల హాకీ ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం భారత జట్టు సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఐహెచ్ఎఫ్ (IHF) అధికారికంగా ప్రకటించింది.
ఈ టోర్నీలో భారత జట్టుకు స్టార్ డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు.
సమీపంలో జరిగిన ప్రో హాకీ లీగ్‌లో పాల్గొన్న నలుగురు ఆటగాళ్లకు ఈ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. తుది జట్టు ఎంపికలో భాగంగా డిఫెండర్ అమన్‌దీప్ లక్రా, మిడ్ఫీల్డర్లు రాజ్‌కుమార్ పాల్, రబిచంద్ర సింగ్ మొయిరాంగ్‌థెమ్, ఫార్వర్డ్ ప్లేయర్ సెల్వం కార్తీలు తమ స్థానాలను కోల్పోయారు. జట్టులో సమతుల్యత మరియు అనుభవానికి పెద్దపీట వేస్తూ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also : India vs Zimbabwe T20 Series: భారత్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించి జింబాబ్వే
Indian squad announced for Hockey World Cup… Harmanpreet Singh named captain.
Hockey World Cup 2026: ఆగస్టు 19న పాకిస్థాన్‌తో బిగ్ ఫైట్
ఈ ప్రపంచ కప్‌లో భారత జట్టు ‘పూల్-డి’లో చోటు దక్కించుకుంది. ఆగస్టు 15న వేల్స్‌తో జరిగే పోరుతో భారత్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. అనంతరం ఆగస్టు 17న ఇంగ్లాండ్‌తో, ఆగస్టు 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌లో తలపడనుంది. గతంలో 2023లో జరిగిన వరల్డ్ కప్‌లో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేక తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.
ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఛాంపియన్‌గా నిలిచింది. 1975లో జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి విజేతగా అవతరించింది. దానికి ముందు 1971లో కాంస్య పతకం, 1973లో రజత పతకం సాధించిన రికార్డు భారత్ సొంతం. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో విజేతగా నిలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
వార్న్, కుంబ్లే రికార్డులు బద్దలు.. అరంగేట్రంలోనే కివీస్ స్పిన్నర్ సంచలనం!

