Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
176 ఏళ్లలో ఎన్నడూ లేని ఎండలు.. రికార్డ్ సృష్టించిన మే నెల

176 ఏళ్లలో ఎన్నడూ లేని ఎండలు.. రికార్డ్ సృష్టించిన మే నెల

వార్త 2 months ago

Weather update:ఈ ఏడాది మే నెల ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఉష్ణోగ్రతలతో రికార్డు సృష్టించింది. 1850 నుండి ఇప్పటివరకు గడిచిన 176 ఏళ్లలో ఇది రెండో అత్యంత వేడి నెలగా నిలిచింది.

ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.79 డిగ్రీలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. పారిశ్రామిక విప్లవం నాటితో పోలిస్తే భూమి వేడి 1.4 డిగ్రీలు పెరిగింది. వాతావరణ మార్పులు తీవ్ర రూపం దాల్చడమే దీనికి ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read also: AP Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఒకవైపు వర్షాలు.. మరోవైపు వడగాల్పులు!

 Unprecedented heat in 176 years

భారత్ లో భగభగమంటోన్న ఎండలు

మన దేశంలో మే నెలలో ప్రజలు ఎండల తీవ్రతతో అల్లాడిపోయారు. వాయువ్య భారత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగనగర్ ప్రాంతంలో మే 27న ఏకంగా 48.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేడి గాలులు సామాన్య ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఎండల ప్రభావం రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Weather update:ఉష్ణోగ్రతల పెరుగుదల వెనుక అసలు కారణం

ప్రపంచవ్యాప్తంగా వేగంగా జరుగుతున్న వాతావరణ మార్పులు ఈ వేడికి మూల కారణం. కర్బన ఉద్గారాల విడుదల పెరగడం వల్ల గ్రీన్ హౌస్ ప్రభావం భూమిపై కనిపిస్తోంది. సముద్ర మట్టాలు పెరగడం, అకాల వర్షాలు, తీవ్రమైన ఎండలు మారుతున్న వాతావరణానికి నిదర్శనాలు. పర్యావరణాన్ని కాపాడుకోవడం, కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా మాత్రమే ఇలాంటి విపరీతమైన వేడి నుండి భూమిని రక్షించుకోగలమని నిపుణులు సూచిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

తెలంగాణలో వింత వాతావరణం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha