AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ప్రఖర్ జైన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also : YS Jagan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: జగన్
Alert for the people of AP: Rains on one hand, heatwaves on the other!
AP Weather Alert: పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
గురువారం నాడు మార్కాపురం సంయుక్త ప్రాంతంతో పాటు రాయలసీమ జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.. దీనితో పాటు ఈ క్రింది జిల్లాల్లోనూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పోలవరం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు
బుధవారం సాయంత్రం నుంచే భారీ వర్షాల సూచన
విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా విజయనగరం, గజపతినగరం, అరకు, ఎస్. కోట, కొత్తవలస, నర్నీపట్నం, చోడవరం, మాడుగుల మండలాల పరిసర ప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా మారడానికి నిదర్శనంగా ఒకవైపు వర్షాలు పడుతుంటే, మరోవైపు ఎండలు మండిపోనున్నాయి. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 42 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాలలో గరిష్టంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
మంత్రి నారా లోకేష్ ఓఎస్డీ డాక్టర్ వరప్రసాద్‌కు రెండు స్వర్ణ పతకాలు

