Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
180 మంది బాలికలను వేధించిన తన్వీర్ ఇంటిపై బుల్డోజర్ ఆపరేషన్

180 మంది బాలికలను వేధించిన తన్వీర్ ఇంటిపై బుల్డోజర్ ఆపరేషన్

వార్త 2 months ago

Maharashtra Bulldozer Operation: మహారాష్ట్రలోని పరాత్వడ నగరంలో వెలుగుచూసిన భయంకరమైన లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సుమారు 180 మంది బాలికలను ప్రేమ పేరుతో వంచించి, వారి అశ్లీల వీడియోలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన నిందితుడు మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతుండగానే, మరోవైపు నిందితుడి అక్రమ నివాసాన్ని మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో, నిందితుడి ఇంటితో పాటు పరిసరాల్లోని అక్రమ కట్టడాలను కూడా నేలమట్టం చేశారు. గతంలోనే నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Read Also:Maharashtra Crime:180 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్ మెయిల్!

Maharashtra Bulldozer Operation: ప్రేమ పేరుతో 180 మందిపై అకృత్యాలు

ఈ దారుణమైన కేసు వివరాల్లోకి వెళ్తే, నిందితుడు తన్వీర్ అమాయక బాలికలను ట్రాప్ చేసి ముంబై, పూణే వంటి నగరాలకు తీసుకెళ్లేవాడు. అక్కడ వారి ఏకాంత క్షణాలను రహస్యంగా చిత్రీకరించి, ఆపై వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు. తనకు సహకరించని పక్షంలో ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసేవాడు. ఈ అకృత్యాల బాధితుల్లో ఒకరు రాజ్యసభ సభ్యుడు అనిల్ బోండేకు లేఖ రాయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం సైబర్ సెల్ సాయంతో ఆన్‌లైన్‌లోని వీడియోలను తొలగిస్తున్న పోలీసులు, ఈ ముఠాలో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకున్నారు.. కానీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha