Dilsukhnagar Protest Today: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం నిరుద్యోగ అభ్యర్థుల ఆగ్రహానికి కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5,000 పోలీస్ ఖాళీల భర్తీకే ప్రకటన జారీ చేయడాన్ని నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
ఎన్నికల ముందు ఇచ్చిన మాట తప్పి ప్రభుత్వం తమను మోసం చేసిందని నిరుద్యోగ జెఎసి (JAC) నాయకులు, అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Read Also:Fatima Owaisi college: ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!
19 వేల పోస్టులు ఇవ్వాల్సిందే.. దిల్‌సుఖ్‌నగర్ స్తంభన!
దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తా వద్ద వందలాది మంది అభ్యర్థులు బైఠాయించడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.
- నిరుద్యోగుల డిమాండ్: రాష్ట్రంలో వేలాది పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కేవలం 5 వేల పోస్టులతో సరిపెట్టకుండా తక్షణమే 19,000 పోలీస్ ఉద్యోగాలతో మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
- సీఎంపై ఫిర్యాదుకు యత్నం – పోలీసుల అడ్డుకోత: తమకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు నిరుద్యోగులు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అలర్ట్ అయిన పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకుని ఈడ్చుకెళ్తూ పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు, పోలీసులకు మధ్య భీకర తోపులాట జరిగి దిల్‌సుఖ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Dilsukhnagar Protest Today: ఇచ్చిన మాట తప్పిన రేవంత్ సర్కార్
యువతను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల గొంతు కోస్తోందని ఆందోళనకారులు మండిపడ్డారు. అరకొర పోస్టులతో నోటిఫికేషన్లు ఇస్తే సహించేది లేదని, తమకు న్యాయం జరిగే వరకు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. అరెస్టయిన అభ్యర్థులను నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Epaper: epaper.vaartha.com
ట్రిపుల్ ఐటీలో విషాదం.. ఆరో అంతస్తు పైనుంచి దూకేసిన స్టూడెంట్.. అసలేం జరిగింది?

