Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రిపుల్‌ ఐటీలో విషాదం.. ఆరో అంతస్తు పైనుంచి దూకేసిన స్టూడెంట్.. అసలేం జరిగింది?

ట్రిపుల్‌ ఐటీలో విషాదం.. ఆరో అంతస్తు పైనుంచి దూకేసిన స్టూడెంట్.. అసలేం జరిగింది?

వార్త 3 weeks ago

IIIT Student Suicide: హైదరాబాద్‌ ఐటీ హబ్ పరిధిలోని గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ (IIIT) క్యాంపస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ చదువుకుంటున్న అనిరుధ్‌ (20) అనే విద్యార్థి హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కోల్పోయాడు.

శనివారం జరిగిన ఈ ఘోర కలికలం క్యాంపస్‌లోని తోటి విద్యార్థులను, అధ్యాపకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుడు అనిరుధ్ ఖమ్మం జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కంప్యూటర్‌ సైన్స్‌ అండ్ ఇంజనీరింగ్ (CSE) విభాగంలో ద్వితీయ సంవత్సరం (సెకండ్ ఇయర్) చదువుతున్నాడు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో క్యాంపస్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also: Ketan Agarwal case: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. సియా స్నాప్‌చాట్ లో విస్తుపోయే నిజాలు

 Tragedy at IIIT: Student jumps from the sixth floor

IIIT Student Suicide: ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు

ఘటనపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అనిరుధ్ అంతటి దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? చదువుల ఒత్తిడి కారణమా? లేక వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థికి సంబంధించిన ఫోన్, ల్యాప్‌టాప్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

నా కొడుకును పోలీసులే చంపేశారు.. మెజిస్టీరియల్ విచారణలో సాయికృష్ణ తల్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha