Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2027 జూన్ నాటికి పోలవరం పూర్తి :కేంద్రం

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి :కేంద్రం

వార్త 1 month ago

Polavaram Project Updates: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి స్పష్టమైన గడువును ప్రకటించడంతో పాటు, నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read Also : టెన్త్ ఫలితాల్లో రికార్డు… ప్రభుత్వ బడులను ప్రమోట్ చేస్తూ విద్యా శాఖ ప్రకటనలు

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి.. కేంద్రం డెడ్ లైన్

పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించి పనుల వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించింది. బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తయితే ఏపీ రూపురేఖలు మారుతాయని, అందుకే దీనిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

Polavaram Project Updates: మరో రూ. 3,300 కోట్ల నిధుల విడుదల

ప్రాజెక్టు పనులకు నిధుల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం అదనంగా రూ. 3,300 కోట్లను విడుదల చేసేందుకు అంగీకరించింది.ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పోలవరం పనుల కోసం రూ. 2,300 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ప్రకటించిన రూ. 3,300 కోట్లతో కలిపి ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున ఆర్థిక వెసులుబాటు కలగనుంది.

ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు, ఇతర కీలక నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరింత ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఏపీ రేషన్ కార్డు దారులకు బిగ్ షాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha