AP Education: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల సందడి మొదలైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 85.15 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఎప్పటిలాగే అమ్మాయిలు పైచేయి సాధించారు.
అయితే, ఈ ఫలితాల్లో అసలైన హైలైట్ ఏమిటంటే.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు స్టేట్ ర్యాంక్ స్థాయి మార్కులతో సత్తా చాటడం.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ మార్కులు సాధించిన 13 మంది విద్యార్థుల వివరాలను విద్యాశాఖ ప్రత్యేకంగా ప్రకటించింది. విశేషమేమిటంటే, ఈ జాబితాలో ఉన్న 13 మందిలో 12 మంది విద్యార్థినులే కావడం గమనార్హం. నలుగురు విద్యార్థినులు 600 మార్కులకు గాను ఏకంగా 596 మార్కులు సాధించగా, మరో 9 మంది 595 మార్కులతో మెరిశారు. ఈ అసాధారణ ప్రతిభను చూసి ఏపీ విద్యాశాఖ "సగర్వంగా నిలబడి" అంటూ ప్రభుత్వ బడుల విద్యా ప్రమాణాలను ప్రమోట్ చేస్తోంది.
Read Also: BC Dedicated Commission: విశాఖలో బిసి డెడికేటెడ్ కమిషన్ పర్యటన
AP Education: మారిన విద్యా స్వరూపం
గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చేపట్టిన వినూత్న సంస్కరణలు ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 'నాడు-నేడు' ద్వారా పాఠశాలల రూపురేఖలు మారగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం LEAP వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో విద్యా రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఏఐ (AI) టెక్నాలజీని ఉపయోగించడం, ఉపాధ్యాయులకు డిజిటల్ టూల్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వంటి చర్యలు విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి.
2029 లక్ష్యంగా మంత్రి లోకేశ్ ప్రణాళికలు
రాష్ట్రంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యాశాఖ పనిచేస్తోంది. "అమ్మలా శిక్షణ.. నాన్నలా రక్షణ" అంటూ ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో అధికారులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
దేశ నిర్ణయాలు విదేశీ ప్రభావంలో ఉన్నాయా?

