Dailyhunt
2027 మెగా టోర్నీలో రోహిత్, కోహ్లీ ఆడతారా?

2027 మెగా టోర్నీలో రోహిత్, కోహ్లీ ఆడతారా?

వార్త 1 week ago

2027 World Cup: భారత క్రికెట్ అభిమానులు 1983, 2011 అద్భుత విజయాలను మర్చిపోలేరు. ఇప్పుడు మూడోసారి ప్రపంచ విజేతగా నిలవాలని భారత్ పట్టుదలతో ఉంది.

2027 అక్టోబర్-నవంబర్ మాసాల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనున్న ఈ టోర్నీలో బౌన్సీ పిచ్‌లు ప్రధాన సవాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో అనుభవం, యువత కలగలిసిన పటిష్ట జట్టును సిద్ధం చేయడంపై బీసీసీఐ దృష్టి సారించింది.

Read Also: Shashi Tharoor poem on Sanju: వాంఖెడేలో సంజూ 'శాంసన్' సునామీ.. శశిథరూర్ కవితాత్మక ప్రశంసలు

యువ సారథి గిల్.. వెన్నుదన్నుగా సీనియర్లు రోహిత్, కోహ్లీ

ఈ మెగా టోర్నీలో టీమిండియాను యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నడిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు చేపడితే, అతనికి తోడుగా వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. మూడో స్థానంలో ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడు. కెరీర్ చివరి దశలో ఉన్న రోహిత్, కోహ్లీలకు ఇది వీడ్కోలు ప్రపంచకప్ కావచ్చనే అంచనాతో వారు కప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.

మధ్య ఓవర్లలో పటిష్టమైన బ్యాటింగ్: రాహుల్, అయ్యర్ కీలకం

ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ భుజాలపై ఉంది. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్‌గా రాహుల్ అనుభవం జట్టుకు ఎంతో అవసరం. ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా ఫినిషర్‌గా మరియు నాలుగో పేసర్‌గా కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ విభాగంలో రవీంద్ర జడేజా కంటే బ్యాటింగ్‌లో మెరుగైన ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.

 ODI World Cup 2027

2027 World Cup: వేగం, స్పిన్ మ్యాజిక్: బుమ్రా నేతృత్వంలో బౌలింగ్ దళం

సౌత్ ఆఫ్రికా పిచ్‌లపై పేసర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పుతారు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో మహమ్మద్ సిరాజ్, యువ సంచలనం హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పిన్ విభాగంలో ‘చైనామన్’ కుల్దీప్ యాదవ్ ప్రధాన ఆయుధంగా ఉండగా, అక్షర్ పటేల్ అతడికి సహకారం అందించనున్నాడు.

ఈ ముగ్గురు స్టార్లకు నిరాశ తప్పదా?

జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, రోహిత్-గిల్ జోడీ వల్ల తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. అలాగే సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లకు కూడా బెంచ్ కే పరిమితం కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

భారత అంచనా జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఫిఫా 2026 ఫైనల్ టికెట్ ధర చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha