Shashi Tharoor poem on Sanju: ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ 'ఎల్ క్లాసికో' పోరులో సంజూ శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
2026 సీజన్ ఐపీఎల్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేయడం విశేషం.
శశిథరూర్ 'లిటరరీ' ప్రశంస
సంజూ శాంసన్ ఇన్నింగ్స్ చూసి ముగ్ధుడైన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎక్స్ (X) వేదికగా ఇలా స్పందించారు.
Shashi Tharoor poem on Sanju: చివరి బంతికి సెంచరీ
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓపెనర్ సంజూ శాంసన్ ముందుండి నడిపించాడు. మిగతా బ్యాటర్లు విఫలమవుతున్నా.. అతడు మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. తొలుత నిదానంగా బ్యాటింగ్ చేసిన అతడు.. ఆ తర్వాత టాప్ గేర్‌లో వచ్చాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చివరి ఓవర్‌లో 6, 6, 4 కొట్టి చివరి బంతికి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మొత్తంగా 54 బంతుల్లో 101 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. సంజూ మినహా మరే బ్యాటర్ కూడా 25 రన్స్ కూడా చేయకపోవడం గమనార్హం. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఘజన్‌ఫర్, అశ్వనీ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ శాంట్నర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు వేసి 38 రన్స్ సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
షెపర్డ్ ఔట్.. బెథెల్ ఇన్! జీటీతో పోరుకు ఆర్‌సీబీ తుది జట్టులో మార్పులు

