Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2027లో అందుబాటులోకి రానున్న కాగితపు కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ

2027లో అందుబాటులోకి రానున్న కాగితపు కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ

వార్త 2 weeks ago

RBI : భారత కరెన్సీ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లను తయారు చేయాలని యోచిస్తోంది.

కాగితపు కరెన్సీ నోట్ల స్థానంలో మరింత మన్నికైన పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దశాబ్దాలుగా పరిశీలనలో ఉన్న ఈ ప్రణాళికను ఇప్పుడు ఆచరణలోకి తెచ్చేందుకు ఆర్బీఐ కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్స్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంత అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి పూర్తి స్థాయిలో ఈ నోట్లను పాలిమర్ తో తయారు చేయాలని భావిస్తోందని సమాచారం.

Read Also: Mumbai Car Tanker Crash: ఇథనాల్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టిన కారు.. ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం!

 RBI

RBI : మొదటిసారిగా ప్లాస్టిక్ నోట్లు ఉత్పత్తి

ఇందుకోసం ఆర్బీఐ టెండర్లను ఆహ్వానించింది. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉత్పత్తి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హతగల తయారీదారుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానించింది. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు కేవలం కాగితపు కరెన్సీ నోట్లు మాత్రమే వాడుకలో ఉన్నాయి. కానీ మొదటిసారిగా, ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టబోతున్నారు. దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆగస్టు 18 లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. పాలిమర్ నోట్లకు అవసరమైన భద్రతా లక్షణాలతో కూడిన అపారదర్శక పాలిమర్ షీట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న కంపెనీలు మాత్రమే ఇందులో పాల్గొనాలని స్పష్టం చేసింది.

Epaper: epaper.vaartha.com

ఇథనాల్ పెట్రోల్‌పై సీనియర్ నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha