Elder Couple Found Dead : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కె) గ్రామంలో వృద్ధ దంపతుల మృతిపై విషాదం నెలకొంది. నర్సారెడ్డి, అంజమ్మ దంపతులు తమకున్న 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటిని ముగ్గురు కుమారులకు పంచిన తర్వాత వారి వద్దే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే తగిన సంరక్షణ లేకపోవడంతో వారు బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపారు. ఆస్తులు పంచిన అనంతరం వృద్ధ దంపతులకు జీవనాధారం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. వృద్ధాప్య పింఛను ఉన్నప్పటికీ రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. చివరకు వారు గ్రామంలోని బంధువుల ఇళ్లలో ఉంటూ జీవనం సాగించినట్లు సమాచారం.
Hyderabad Techie Suicide: భర్త సమయం కేటాయించడం లేదని యువతి ఆత్మహత్య
Elder Couple Found Dead
Elder Couple Found Dead : అధికారులకు దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం
తమకు కనీసం కొంత భూమిని తిరిగి తమ పేరుపై చేయాలని నర్సారెడ్డి అధికారులను కోరినట్లు గ్రామస్థులు తెలిపారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు. వృద్ధుల పరిస్థితిపై అధికారులు ముందుగానే స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటన వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ, ఆస్తుల పంపిణీ తర్వాత వారి జీవన భద్రత వంటి అంశాలపై చర్చకు దారితీసింది. వృద్ధులు తమ ఆస్తులను బదలాయించే ముందు భవిష్యత్ జీవన అవసరాలు, ఆర్థిక భద్రత, సంరక్షణకు సంబంధించిన ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన ప్రస్తావిస్తోంది.

