Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
22A బాధితులకు హరీశ్‌రావు భరోసా.. న్యాయం జరిగే వరకు పోరాటం

22A బాధితులకు హరీశ్‌రావు భరోసా.. న్యాయం జరిగే వరకు పోరాటం

వార్త 2 months ago

Harish Rao: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 22-ఏ భూముల బాధితులందరి పక్షాన నిలబడి ప్రభుత్వంతో పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పష్టం చేశారు.

మేడ్చల్ జిల్లాలోని తిరుమల మెడోస్ అలాగే లక్ష్మీగణపతి కాలనీలో పర్యటించిన ఆయన, స్థానిక 22A బాధితులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 22ఏ కింద ఆగిపోయిన ఆస్తుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తీవ్రంగా డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక

ప్రభుత్వ పెద్దల వైఖరిని విమర్శిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎలా చేయాలో తెలిసినట్లుగానే, తమకు ప్రజల కోసం ఎలా పోరాడాలో బాగా తెలుసని హరీశ్ రావు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులతో రోడ్డెక్కి తిరగబడే పరిస్థితి రాకముందే, ప్రభుత్వం స్పందించి 22-ఏ భూముల చిక్కులను పరిష్కరించాలని ఆయన హితవు పలికారు.

పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారికి గుడ్ న్యూస్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha