CMRF Cheques: వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల వైద్య చికిత్సలకు ఆర్థిక చేయూత అందించే ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆరోపించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన ప్రతి బాధితుడికి వేగంగా సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు.
గురువారం కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 23 మంది అనారోగ్య బాధితులకు మొత్తం రూ.15,26,220 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టీడీపీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ పేదల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి రాజీ పడడం లేదన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పంపే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆలస్యం లేకుండా చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు.అలాగే, గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ పథకం అమలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ప్రజలు ఆ పథకాన్ని మరచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే విమర్శించారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
CMRF Cheques
ఈ కార్యక్రమంలో పడిపాటి నారాయణప్ప, కర్లకుంట రామాంజనేయులు, నరసింహమూర్తి, గోళ్ల జాలప్ప, తులసిబాయి, సుగాలి చంద్రానాయక్, రాము, మాల గోవిందప్ప కుటుంబ సభ్యులు, వడ్డే సాయితేజ, పీట్ల అశోక్, తరుణ్ కుమార్, కుమ్మరి వైష్ణవి, తాటి తిప్పమ్మ, కురుబ తిమ్మప్ప కుటుంబ సభ్యులు, జీ. నీలక్షిత, వరలక్ష్మమ్మ, వాలిపిరెడ్డి బాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బోయ జమునమ్మ, ముసలక్కగారి సువర్ణమ్మ, ఉప్పర అక్కులప్ప, గొల్ల వరలక్ష్మి, బేబీ ఆఫ్ దొనక్కగారి గంగమ్మ కుటుంబ సభ్యులు, చాపిరి అక్కమ్మ తదితర లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
భక్తులకు జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు.. ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ సందేశం!

