Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
25 సెక్యూరిటీ ఫీచర్లతో ఇంటర్ మెమోలు..!

25 సెక్యూరిటీ ఫీచర్లతో ఇంటర్ మెమోలు..!

వార్త 1 month ago

Intermediate Memo : విద్యారంగంలో నకిలీ సర్టిఫికెట్ల బెడదను పూర్తిగా అరికట్టేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అత్యంత పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థుల ఒరిజినల్ మెమోలను (Intermediate Memo) అత్యాధునిక హై-సెక్యూరిటీ ప్రమాణాలతో సిద్ధం చేసింది.

ఇప్పటివరకు అమల్లో ఉన్న సెక్యూరిటీ విధానాలను మరింత మెరుగుపరుస్తూ, ఏకంగా 25 రకాల భద్రతా ఫీచర్లతో కొత్త మెమోలను ముద్రించి పంపిణీకి శ్రీకారం చుట్టింది.

నీటిలో తడిచినా నష్టం కలగకుండా :

నకిలీలను సృష్టించడం ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ కొత్త మెమోలను రూపకల్పన చేశారు. నీటిలో తడిచినా లేదా పొరపాటున నలిగిపోయినా ఎలాంటి నష్టం కలగకుండా నాన్-టియరబుల్ (Non-tearable) మరియు వాటర్ ప్రూఫ్ విధానంలో వీటిని ముద్రించారు. అంతేకాకుండా, విద్యార్థుల గుర్తింపు మరింత స్పష్టంగా ఉండేందుకు మెమోపై రెండు కలర్ ఫోటోలను పొందుపరిచారు.

సాధారణ కంటికి కనిపించకుండా, కేవలం యూవీ (UV) లైట్ లో మాత్రమే స్పష్టంగా వెలుగులో కనిపించే ప్రత్యేక సెక్యూరిటీ గుర్తులను ఇందులో చేర్చడం మరో ప్రధాన విశేషం. దీనివల్ల సర్టిఫికెట్ల ప్రామాణికతను క్షణాల్లో గుర్తించడం సులభమవుతుంది.

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 4 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఈ హై-సెక్యూరిటీ మెమోలను బోర్డు అధికారులు ఎంతో జాగ్రత్తగా కాలేజీల వారీగా ప్రత్యేకంగా ప్యాక్ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఆలస్యం కాకుండా ఈ మెమోలను జిల్లాల వారీగా ఉన్న అధికారులకు సురక్షితంగా రవాణా చేశారు. ఉద్యోగ వేటలో, ఉನ್ನత చదువుల్లో విద్యార్థులకు మోసాలు జరగకుండా మరియు పారదర్శకతను పెంచే దిశగా ఇంటర్ బోర్డు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.

వరలక్ష్మి వ్రతం మహత్యం : భక్తి, సౌభాగ్యాల ప్రతీక..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha