Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
28, 29న నెల్లూరులో ఏపీఎస్‌సీపీసీఆర్ పర్యటన

28, 29న నెల్లూరులో ఏపీఎస్‌సీపీసీఆర్ పర్యటన

వార్త 1 week ago

APSCPCR Chairperson: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) చైర్‌పర్సన్ వెటుకూరి ఏ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు మరియు కమిషన్ సభ్యురాలు కే.జి.

వెంకట పద్మలత ఈ నెల 28, 29 తేదీల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఈ పర్యటనకు సంబంధించిన సమగ్ర వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

పాఠశాలలు, బాలల గృహాల క్షేత్రస్థాయి పరిశీలన

జూలై 28వ తేదీ (మంగళవారం) ఉదయం 10.00 గంటలకు మంగళగిరి నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటలకు వీరు నెల్లూరు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV), స్కాన్ సెంటర్లు, బాలల గృహాలు, పరిశ్రమలు మరియు చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్‌ను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

APSCPCR Chairperson: కలెక్టరేట్‌లో శాఖలవారీ సమీక్షా సమావేశం

జూలై 29వ తేదీ (బుధవారం) ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కమిషన్ చైర్‌పర్సన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.ఈ సమావేశంలో మహిళా-శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, బాలల గృహాలు, వన్ స్టాప్ సెంటర్, శక్తి నివాస్, డీసీపీయూ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, పోలీసు శాఖ మరియు రవాణా శాఖల అధికారులతో బాలల సంక్షేమం, భద్రత, బాల్య వివాహాల నివారణ, పోక్సో (POCSO) చట్టం అమలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం మరియు ఆధార్ సేవలపై సమగ్ర సమీక్ష జరుపుతారు.సమీక్ష అనంతరం స్వచ్ఛంద సంస్థల (NGOs) ప్రతినిధులు, ప్రజల నుండి వినతులు స్వీకరించి కమిషన్ ప్రతినిధులు తిరుగు ప్రయాణమవుతారని కలెక్టర్ హిమాన్షు శుక్ల స్పష్టం చేశారు.

రేపు కృష్ణా జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha