Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం (జూలై 27) కృష్ణా జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. పెనమలూరు నియోజకవర్గం పరిధిలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే పార్టీ సమీక్షా సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
ఈ పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది.

పునాదిపాడులో జూనియర్ కళాశాల ప్రారంభం – జెడ్పీ పాఠశాల సందర్శన
సోమవారం ఉదయం 10:15 గంటలకు కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామానికి మంత్రి లోకేశ్ చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించి, అక్కడి పరిస్థితులు, విద్యార్థుల వసతులను తెలుసుకుంటారు. ఈ కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం 12 గంటల వరకు సాగుతాయి.
Nara Lokesh: కంకిపాడులో టీడీపీ నేతలు, కార్యకర్తల సమన్వయ సమావేశం
మధ్యాహ్నం 1:00 గంట నుంచి 2:30 గంటల వరకు కంకిపాడులోని అయానా కన్వెన్షన్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. పెనమలూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం, టీడీపీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

