Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
3 రోజులు వర్ష సూచన.. తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం

3 రోజులు వర్ష సూచన.. తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం

వార్త 5 days ago

AP Weather Update: ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల రాక, ఉపరితల ఆవర్తనద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ వర్షాల సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని ఆ తర్వాత రోజుల్లు ఉష్ణోగ్రతలు కూడా 3 నుంచి4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఈ సోమవరం మే 18న ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు కొమరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాలకు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం మరికొన్ని ప్రాంతాలకు, ఆండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మొత్తం అండమాన్ అండ్ నికోబర్ దివులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు దగ్గరగా చేరుకున్నాయని స్పష్టం చేసింది.

Read also: Heatwave in Telangana: తెలంగాణలో పెరుగుతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో వడగాలులు

 Rain forecast for 3 days.

AP Weather Update: కేరళ తీరంలోకి ముందస్తుగా రానున్న నైరుతి రుతుపవనాలు

రాబోయే 3 4 రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియ3 ఆ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు కొమొరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మిగిలిని భాగాలు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని దీంతో మే 24 నాటికి అంటే 4రోజుల ముందుగానే ఈసారి రుతుపవనాలు కేరళా తీరాన్నితాకే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మద్య ఎత్తులో విస్తరించి ఉందని ద్రోణి అంతరాయం, దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ ఆరేబియా సముద్రం నుండి కేరళ దక్షిణ అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని తెలిపింది.

వర్షాల తర్వాత పెరగనున్న ఎండలు

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ వర్షాల సమయంలో గంటలకు 30-40 కిలోమీటర్ల వేగముతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఇక దక్షిణ కోస్తా ఆంద్రప్రదేశ్లోనూ రాబోయే 3 రోజులు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అలాగే కొస్తో ఆంధ్రప్రదేశ్ యానాంలో మంగళవారం వేడి తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముందని తెలిపారు. ఆ తరువాత 5 రోజుల్లో వడగాలులు ఒకట లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. రాయలసీమలో రాగల 5రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40-43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు కావచ్చని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha