Telangana weather update: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అయితే, ఈ వర్షాల ఉపశమనం కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత నుంచి భానుడు తన ప్రతాపం చూపించనున్నాడని అధికారులు హెచ్చరించారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, వికారాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
Rains in Telangana today and tomorrow..
Telangana weather update: రెండు రోజుల వర్షాల తర్వాత, ఎల్లుండి (బుధవారం) నుంచి రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరగనుంది. విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. రాబోయే రోజుల్లో వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.
ఎండ తీవ్రత హఠాత్తుగా పెరగనున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు బయటకు రాకూడదని పేర్కొన్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి నిరంతరం తగినన్ని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు.
Telangana weather update: ప్రజలకు అధికారుల కీలక సూచనలు
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు 3 నెలలు బంద్!

