Goa Crime: పర్యాటక ప్రాంతం గోవాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక బీజేపీ కార్పొరేటర్ సుశాంత్ నాయక్ కుమారుడు సోహమ్ నాయక్ (22), గత మూడేళ్లుగా సుమారు 30 మంది బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు సంచలన విషయాలు బయటపడ్డాయి.
ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Read Also:Traffic Restrictions : వాహనదారులకు అలర్ట్..హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
Goa Soham Naik Arrest BJP Corporator Son
Goa Crime: వీడియోలతో బ్లాక్‌మెయిల్ – మూడేళ్లుగా కొనసాగిన అరాచకం
నిందితుడు సోహమ్ నాయక్ బాలికలపై అత్యాచారం చేయడమే కాకుండా, ఆ దృశ్యాలను మొబైల్‌లో రికార్డ్ చేసేవాడు. ఈ విషయాలను ఎవరికైనా చెబితే, వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తానని బాధితులను తీవ్రంగా బెదిరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ భయంతోనే బాధితులు గత మూడేళ్లుగా మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. అయితే మార్చి 22న ఆదివారం సోహమ్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ..
లైంగిక చర్యలకు సంబంధించిన వీడియోలను వాళ్లకి చూపించాడు. దీంతో ఈ విషయం బయటపడింది. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.ప్రస్తుతం అతడిపై విచారణ జరుగుతోందని తెలిపారు. నిందితుడిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత బాలికలను గుర్తించి వాంగ్మూలం రికార్డు చేస్తామన్నారు. అలాగే బాధిత బాలికలకు గోప్యత, భద్రత ఉంటుందని తెలిపారు
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

