Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
44 ఏళ్ల కల సాకారం..భారత మహిళల హాకీ జట్టుకు స్వర్ణం

44 ఏళ్ల కల సాకారం..భారత మహిళల హాకీ జట్టుకు స్వర్ణం

వార్త 3 weeks ago

Asian Games 2026: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్-2026లో భారత మహిళల హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను 1-0 తేడాతో ఓడించిన భారత్ స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.

ఈ అద్భుత విజయంతో 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడటమే కాకుండా, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు భారత్ నేరుగా అర్హత సాధించింది.

Read also: Lovlina Borgohain: ఆసియా క్రీడల్లో లవ్లీనా సత్తా.. 75 కిలోల్లో స్వర్ణం కైవసం

సవితా పునియా సూపర్ సేవ్!
ఆట ఆరంభం నుంచే భారత్ దూకుడు ప్రదర్శించింది. మ్యాచ్ 10వ నిమిషంలో స్టార్ ఫార్వర్డ్ క్రీడాకారిణి లాల్‌రెమ్‌సియామి ‘టోమహాక్’ షాట్‌తో మెరుపు గోల్ అందించి భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపింది. అనంతరం కోలుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, భారత డిఫెండర్లు ప్రత్యర్థి ఎటాక్‌ను సమర్థవంతంగా అడ్డుకున్నారు. ముఖ్యంగా వెటరన్ గోల్‌కీపర్ సవితా పునియా ప్రత్యర్థి జట్టు సాధించిన పెనాల్టీ స్ట్రోక్‌ను అద్భుతంగా సేవ్ చేసి భారత్ ఆధిక్యాన్ని కాపాడింది.

44 ఏళ్ల కల సాకారం
మహిళల హాకీలో భారత్‌కు ఇది రెండో ఆసియా గేమ్స్ స్వర్ణం. 1982లో ఆసియా గేమ్స్‌లో మహిళల హాకీని ప్రవేశపెట్టినప్పుడు తొలిసారిగా భారత్ పసిడి పతకం సాధించింది. ఆ తర్వాత 1998 (దక్షిణ కొరియా చేతిలో), 2018 (జపాన్ చేతిలో) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలతో సరిపెట్టుకుంది. ఇప్పుడు 44 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఆసియా ఖండంలో ఆధిపత్యాన్ని చాటుతూ పసిడిని సొంతం చేసుకుంది.

ఇక ఈ టోర్నీలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో దక్షిణ కొరియాపై పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో విజయం సాధించిన జపాన్ కాంస్య పతకాన్ని దక్కించుకోగా, చైనా రజతంతో సరిపెట్టుకుంది.

Read also:Yuzvendra Chahal Retirement: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha