Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్!

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్!

వార్త 3 weeks ago

Yuzvendra Chahal Retirement: భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రెడ్ బాల్ (ఫస్ట్ క్లాస్) క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

టీమిండియా తరఫున టెస్ట్ క్యాప్ ధరించాలన్న తన చిరకాల స్వప్నం ఇక నెరవేరే అవకాశం లేదని గ్రహించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. అయితే, వన్డే మరియు టీ20 పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రం తన ప్రస్థానం కొనసాగుతుందని, దేశం కోసం ఆడేందుకు శ్రమిస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు.

Yuzvendra Chahal Retirement: చాహల్ భావోద్వేగ పోస్ట్ & ఫస్ట్ క్లాస్ కెరీర్ గణాంకాలు

"నేను మొదటిసారి పట్టుకున్నది రెడ్ బాల్. నా చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లార్డ్స్‌లో ఆడాను. టెస్ట్ క్యాప్ ధరించడం నా కల. ఎన్నో ఏళ్లుగా ఆ కలను మోశాను. అది నెరవేరకపోయినా, ఈ ఫార్మాట్‌లో లభించిన ప్రతి అవకాశానికి కృతజ్ఞుడిని. రెడ్ బాల్ క్రికెట్ నాకు ఓపిక, పట్టుదలను నేర్పించింది" అంటూ చాహల్ భావోద్వేగానికి లోనయ్యాడు. నా దేశం కోసం ఆడాలనే ఆకలి నాలో ఇంకా సజీవంగా ఉందన్న చాహల్, వన్డే మరియు టీ20ల్లో రీ-ఎంట్రీ ఇవ్వడానికి సర్వశక్తులు ఒడ్డుతానని ధీమా వ్యక్తం చేశాడు. 2009లో హర్యానా తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన చాహల్, 49 మ్యాచ్‌లలో 32.27 సగటుతో 148 వికెట్లు పడగొట్టాడు. 2016-17 రంజీ సీజన్‌లో 7 మ్యాచ్‌లలో 33 వికెట్లతో అద్భుతంగా రాణించాడు. ఇటీవల కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడి 16.14 సగటుతో 21 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించడమే కాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో హర్యానా విజయంలో 18 వికెట్లతో కీలకపాత్ర పోషించాడు. తన ప్రయాణంలో అండగా నిలిచిన హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు, రణ్‌బీర్ సింగ్ మహీంద్రా, అనిరుధ్ సింగ్ చౌదరీలకు చాహల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha