Dailyhunt
482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వులు: సత్యకుమార్ యాదవ్

482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వులు: సత్యకుమార్ యాదవ్

వార్త 2 weeks ago

Vijayawada: ప్రజారోగ్య శాఖ ద్వారా శాశ్వత ప్రాతిపదికన 482 మంది వైద్యులకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

ఉత్తర్వులు పొందిన వారు 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు, బోధనా సుపత్రుల్లో ట్యూటర్ల కేటగిరిలో కలిపి 636 పోస్టుల భర్తీకి కిందటేడాది నోటిఫికేషన్ జారీచేయగా సుమారు 5వేల వరకు దరఖాస్తులు వచ్చాయి.

Read also: AP Doctors Recruitment : వైద్య రంగంలో ప్రభుత్వ కీలక నిర్ణయం

Appointment Orders Issued to 482 Doctors

Vijayawada: కొత్తగా 482 మంది వైద్యుల నియామకం

ఎంబీబీఎస్ అర్హతతో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రిజర్వేషన్, ఇతర నియము నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన జాబితాను మార్చి 11న నియామక బోర్డు ప్రకటించింది. దీనికి అనుగుణంగా స్పోర్ట్స్ కేటగిరి మినహాయించి 611పోస్టుల భర్తీ చర్యల్లో భాగంగా ఎంపికైన వారి నుంచి సోమవారం ఉదయం 11 నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఆప్షన్లు స్వీకరించారు. తొలుత ప్రకటించిన సమయం కంటే అభ్యర్థుల విజప్తి మేరకు అప్షన్ల నమోదు సమయాన్ని అదనంగా పెంచారు. నియామక కౌన్సిలింగ్ ప్రక్రియ, పోస్టింగ్ ఉత్తర్వులు జారీ పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్లో జరిగింది. ఆప్షన్లకు అనుగుణంగా 611 పోస్టు లకుగాను 482మంది అభ్యర్థులు స్పందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆస్తి పన్ను పెంపు ఉపసంహరించుకోవాలి.. బాబూరావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha